Share Post

ఓ ప్రొఫెసర్,..నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో

సదరు ప్రొఫెసర్ పైన కఠిన చర్యలు :

 

నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో

నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో


కేరళలోని కోజికోడ్‌లో టీచర్ ట్రెయినింగ్ కేంద్రంలో ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం అమ్మాయిలు తమతమ హిజాబ్‌లను సరిగా ధరించకపోవడం వల్ల వారి ఎద భాగం ఆకృతులు సగానికి కోసిన పుచ్చకాయ ముక్కల్లా వున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనితో అతడిపై మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొందరైతే అతడి వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ నగ్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

స్థానిక కళాశాలల్లోని విద్యార్థునులు సదరు ప్రొఫెసర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అతడిపై చర్యలు తీసుకునేవరకూ తాము సగానికి కోసిన పుచ్చకాయ ముక్కల్ని అతడికి బహుమానంగా పంపుతామని చెప్పారు. మరికొందరైతే తమ నగ్న వక్షోజాలను ఫోటో తీసి వాటిని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. వీటిని ఫేస్ బుక్ తొలగించేసింది. అలా నగ్న ఎద భాగాన్ని పోస్ట్ చేసిన 25 ఏళ్ల యువతి మాట్లాడుతూ…. ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపింది.

ఇటీవలే సోషల్ మీడియాలో ఓ మోడల్ ఓ చంటి పిల్లవాడికి పాలు ఇస్తూ మేగజైన్ కవర్ ఫోటోలు ఇస్తున్న ఈ దశలో ఓ ప్రొఫెసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. అందువల్లనే తను న్యూడ్ బ్రెస్ట్ ఫోటోను పోస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఫోటోలను పోస్ట్ చేయడం తన భర్తకు తెలుసుననీ, ఆయనే తన ఫోటోలను ఇతర సామాజిక మాధ్యమాలకు షేర్ చేసారంటూ తెలిపింది. కాగా సదరు ప్రొఫెసర్ ను కాలేజీ యాజమాన్యం వెనకేసుకొచ్చింది. అతడు మాట్లాడిన కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి ఇలా వక్రీకరించారనీ, పైగా అతడు మాట్లాడింది కూడా కాలేజీలో కాదంటూ వెల్లడించింది. ఐతే మహిళలు మాత్రం అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-tollywood-handsome-stunning-looks/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *