నాయికలను ఈర్ష్య పడేలా చేసే కత్రినా :
జులై 16తో 35 వయసులో అడుగుపెట్టనున్న కత్రినా పెళ్ళెప్పుడు అంటే మాత్రం మాట దాటవేస్తోంది. ఇలా అవకాశాలు వెల్లువలా వస్తున్నప్పుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు పెళ్లి గురించి ఆలోచిస్తుంది. తెలుగులో మల్లేశ్వరి సూపర్ హిట్ అయినా బాలకృష్ణతో అల్లరి పిడుగు తర్వాత మరో సినిమా చేయలేకపోయిన కత్రినా అవకాశాలు వస్తున్నాయి కానీ డేట్స్ ఖాళీ లేవు అంటోంది,

నాయికలను ఈర్ష్య పడేలా చేసే కత్రినా
వారానికో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ని ఏ మాత్రం తగ్గించుకోకుండా అలాగే మైంటైన్ చేయటం విశేషమనే చెప్పాలి. సోషల్ మీడియాలో మిలియన్ల ఫాన్ ఫాలోయింగ్ తో తన తోటి నాయికలను ఈర్ష్య పడేలా చేసే కత్రినా ప్రస్తుతం అమెరికా ప్లస్ కెనడా ట్రిప్ లో బిజీ బిజీ గా ఉంది.
దబాంగ్ రీ లోడెడ్ పేరుతో సాగుతున్న ట్రిప్ లో ఉన్న కత్రినా సల్మాన్ ఖాన్-జాక్వలిన్ ఫెర్నాండెజ్-మనీష్ పాల్-డైసీ షా-సోనాక్షి సిన్హా లతో కలిసి అక్కడి స్టేజిల మీద రచ్చ రంబోలా అనిపించే రేంజ్ లో డాన్స్ షోలు ఇస్తోంది. స్టేజి మీదే కాదు ఆఖరికి డ్రెసింగ్ రూమ్ లో కూడా భలే స్టిల్స్ ఇస్తూ ఫాన్స్ మతులు పోగొడుతోంది.
అమీర్ ఖాన్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తగ్స్ అఫ్ హిందుస్థాన్ లో కత్రినా హీరోయిన్ కాగా షారుఖ్ ఖాన్ మఱుగుజ్జుగా నటిస్తున్న జీరో కూడా తన ఖాతాలోనే ఉంది. ఇది కాకుండా రెమో డిసౌజా తీయబోయే త్రిడి డాన్స్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
Read Also : http://www.legandarywood.com/photo-story-balayya-rajasekhar-combo-movie/