Share Post

‘మనదేశం’ తోనే ఎన్టీఆర్ జీవిత చరిత్రకు శ్రీకారం !

అభిమానమును మించిన ధనము, ఆదరము ఈ లోకమున లేదు :

మీకు సదా ఋణపడ్డట్టే. నా శుభాకాంక్షలు, సోదరుడు రామారావు” అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్.. నాడు నేడు ‘మనదేశం’ తోనే చరిత్రకు శ్రీకారం అంటూ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా వారు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కోరుకున్నారు. ‘మనదేశం’ చిత్ర సీన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు బాలకృష్ణ, క్రిష్ తెలిపారు,

 

అభిమానమును మించిన ధనము, ఆదరము ఈ లోకమున లేదు

అభిమానమును మించిన ధనము, ఆదరము ఈ లోకమున లేదు

 

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతోన్న ‘ఎన్టీఆర్’ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు తన మొదటి సినిమా రంగప్రవేశం ‘మనదేశం’ సినిమాతో జరిగింది. మనదేశం సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బాలకృష్ణ చెప్పారు. ఈ సీన్‌ను గురువారం ‘ఎన్టీఆర్ బయోపిక్’ కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.

అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. “అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-glamorous-poses/

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *