Akhanda – The Roaring Lion:

అఖండ – గర్జించే సింహం:

సరైన ‘కథ’ పడితే… ఇండస్ట్రీ ‘షేక్’ చేసే స్టామినా ఉన్న అతి కొద్ది మందిలో ‘మాస్ కా బాప్ నందమూరి బాలకృష్ణ’ ఒకరు. తాజాగా బాలయ్య | బోయపాటి శ్రీను కంబినేషన్లో వస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్-టైనర్ అఖండ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ‘డిసెంబర్ -2’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పటానికి ఈ ట్రైలెర్స్ ఒక గొప్ప ఉదాహరణ.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే గుర్తుండిపోయేలా అవుతుందని చెప్పటానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఒక ఉదాహరణ. దీనికి థమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గొప్పగా ఉంది. సినిమాటోగ్రాఫర్ ‘రామ్ ప్రసాద్ విజువల్స్ | కోటగిరి వెంకటేశ్వరరావు తమ్మిరాజు ఎడిటింగ్ | ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ పనితనం’ చెప్పుకోదగిన విధంగా ఉన్నాయి.

మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ‘అఖండ’లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా | శ్రీకాంత్ విలన్ గా… జగపతిబాబు | పూర్ణ | కాలకేయ ప్రభాకర్ వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు…. ముందు ఉన్న సవాళ్ళను | రికార్డ్స్ ను తిరగరాయాలని కోరుకుంటూ ‘జై బాలయ్య ! ‘

About the Author

Related Posts

Leave a Reply

*