అది సాధ్యం కావాలంటే ?

అది సాధ్యం కావాలంటే ?

 

అది సాధ్యం కావాలంటే ?

అది సాధ్యం కావాలంటే ?


విటమిన్లు శరీరానికి కావలసిన మోతాదులో అందకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. విటమిసిన్ సి అందకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.


1. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా వుంది. నిమ్మను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు దరిచేరవు. జలుబు,జ్వరం లాంటివి బాధించవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకునేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి బాగుంటే అలసట కూడా దరిచేరదు. అది సాధ్యం కావాలంటే విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.


2. బరువు తగ్గాలనుకుంటే రోజువారి ఆహారంలో ఈ పోషకం వీలైనంత ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. సి విటమిన్ రక్తంలో చక్కెర స్థాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తూనే కెలొరీలను కరిగిస్తుంది. అలా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.


3. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేసే బదులు, సి విటమిన్ అందించే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల మనసుకు సాంత్వన అందిస్తుంది.


4. ఎండ నుంచి కాపాడటంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ కారణంగా చర్మం నల్లగా మారి, కమిలిపోతుంటుంది. అలాగే వార్థక్యపు ఛాయలు వేధిస్తుంటాయి. వీటి ప్రభావాన్ని చాలామటుకు తగ్గించుకోవాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.


5. గుండె జబ్బుల బారినుంచి కాపాడటం లోను ఈ విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఈ విటమిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చేస్తుండాలి.

 

Read Also : http://www.legandarywood.com/photos-anupama-parameswaran-latest-poses/

About the Author

Related Posts

Leave a Reply

*