అనుష్క ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తిరుగుతాయి

బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే :

అరుంధతి చిత్రంతో అందాల నటి, స్వీటీ అనుష్క హీరోలతో సమాన రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. మొదట్లో అనుష్క పారితోషికం లక్షల్లో ఉండేది. అయితే గ్రాఫిక్స్ మాయాజాలం తో వచ్చిన అరుంధతి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ అనూహ్యంగా కోటికి పెంచేసింది.

అప్పట్లో అదే చాలా ఎక్కువ. ఆ తర్వాత మిర్చి, ఢమరుకం, బాహుబలి తర్వాత అనుష్క శెట్టి తన రెమ్యునరేషన్ నాలుగు కోట్ల వరకూ పెంచేసింది. మంగుళూరులో పుట్టిన అనుష్క అసలు పేరు స్వీటీ. బెంగళూరులో స్టడీస్ పూర్తిచేసింది,

 

బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే

బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే

 

బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ)చేసిన అనుష్క ఏనాడూ కంప్యూటర్ జాబు చేసిందే లేనేలేదు. అయితే పార్ట్ టైం గా నేర్చుకున్న యోగా ఆమెకు దివ్య యోగం అయింది. యోగా కారణంగా నాగార్జునతో పరిచయం అది కాస్తా సూపర్ మూవీలో ఛాన్స్ తేవడం జరిగాయి.

ఈమె ఆస్థి దాదాపు 240కోట్లు ఉంటుందని సినీ వర్గాల్లో అంచనా. నగదు రూపంలో అసలు తన దగ్గర ఏమీ ఉంచుకోడానికి ఇష్టపడని ఈ యోగా భామ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాస్తోంది. ఇక బెంగళూరులో విలాసవంతమైన భవంతులు, ఫామ్ హౌస్ లు అనుష్క పేరిట ఉన్నాయి.

బాహుబలి తర్వాత హైదరాబాద్ లో కొన్ని నివాస యోగ్య స్థలాలు కొన్నట్లు టాక్. అయితే ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం వాటి ధర వందకోట్ల వరకూ ఉంటుందని అంచనా. తరచుగా దుబాయి వెళ్లే ఈ బ్యూటీ అక్కడ నచ్చిన ఆభరణాలు కొనుగోలు చేస్తుందని టాక్ వినిపిస్తున్నందున ఆమె వద్ద గోల్డ్ కూడా పెద్దమొత్తంలో ఉంటుందని అంచనా.

అంతెందుకు ఆమె వద్ద బెంజ్ కారుందని, ఇక ఆమె వద్ద ఉన్న బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే ఉంటుందని అంటున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-another-size-zero-beauty/

About the Author

Related Posts

Leave a Reply

*