అమరావతిలో మరో కీర్తి ‘నోవోటోల్’ ప్రారంభం !

అమరావతిలో మరో కీర్తి ‘నోవోటోల్’ ప్రారంభం :

‘అమరావతి – విజయవాడ’ నగరంలోని ‘భారతీ నగరు’లో నూతనంగా నిర్మించిన నోవొటెల్ ఐదు నక్షత్రాల హోటల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం ప్రారంభించారు. కాగా ప్రారంభోత్సవానికి హాజరైన చంద్రబాబు గారికి వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభుకిషోర్, సీఈవో మాధవ్, జీఎం మధుపాల్ ఘన స్వాగతం పలికారు.

 

మరో కీర్తి 'నోవోటోల్' ప్రారంభం

మరో కీర్తి ‘నోవోటోల్’ ప్రారంభం

 

రూ.150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ హోటల్ లో 227 గదులు, 4 రెస్టారెంట్లు, 10 వేల చదరపు అడుగుల సమావేశ మందిరాలను నోవొటెల్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకు వచ్చింది. సౌర విద్యుత్, ఎల్ఈడీ బల్బులు, 200 మీటర్ల వాకింగ్ ట్రాక్, జిమ్, స్పా, ధ్యాన మందిరం, యోగా, వైఫై వంటి దాదాపు అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

 

అమరావతిలో మరో కీర్తి

అమరావతిలో మరో కీర్తి

 

ఇంత ఆహ్లాదకరమైన హోటల్ ను నిర్మించినందుకు హొటల్ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఒలింపిక్స్ ప్రమాణాలతో 45 మీటర్ల ఈతకొలను నిర్మించిన నోవొటెల్ యాజమాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు.

 

Read Also : http://www.legandarywood.com/

About the Author

Related Posts

Leave a Reply

*