అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం !
అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం :
చైనాకు భారీ షాకిచ్చారు డోనాల్డ్ ట్రంప్, అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకుంది. చైనా దిగుమతులపై మరిన్ని సుంకాలను విధిస్తామని గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. మరో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
చైనా తన వాణిజ్య విధానాలను మార్చుకునేందుకు ఆసక్తికరంగా లేదని, అందుకే మరిన్ని సుంకాలు విధించినట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.

అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం
వాస్తవానికి ప్రతి ఏడాది సుమారు 505 బిలియన్ల డాలర్ల ఖరీదైన చైనా వస్తువులను అమెరికన్లు కొనుగోలు చేస్తారు. గత జూలైలో చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని మొదటి సారి పెంచారు. అప్పుడు సుమారు 50 బిలియన్ల డాలర్ల ఖరీదైన ప్రొడక్ట్స్‌పై ఆ సంకాన్ని వసూల్ చేశారు.
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి చైనా నుంచి వస్తున్న వస్తువులపై అమెరికన్లు అదనంగా మరో 10 శాతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన చైనా, ప్రతీకార వాణిజ్య చర్యకు దిగనున్నట్లు కూడా పేర్కొన్నది. ఈసారి మొత్తం ఆరు వేల ఉత్పత్తులపై సుంకాన్ని వసూల్ చేయనున్నారు. దాంట్లో బియ్యం, దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
Read Also : https://www.legandarywood.com/fuel-price-effect-bjp-epic-makes-fraud/