Previous Story
ఆరోగ్యకరమైన ‘జీవితానికి ఐదు’ సూత్రాలు!
ఆరోగ్యకరమైన ‘జీవితానికి ఐదు’ సూత్రాలు:
మనలో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటాము. దానికోసం హాస్పిటల్ చుట్టూ తిరగటం, మందులు & మాత్రలు తీసుకుంటాము. వీటి వాడకం కంటే ఈ పద్ధతులు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..

‘జీవితానికి ఐదు’ సూత్రాలు
- ద్రవపానీయం, ఆహారం తినేముందు కాకుండా ఒక అరగంట ముందు లేదా అరగంట తరువాత మాత్రమే సేవించాలి. అలాగే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రాట్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.
- ఒకేసారి ఎక్కువకాని, తక్కువకాని ఆహారాన్ని తీసుకోకూడదు, సమపాళల్లోనే ఆహారాన్ని భుజించాలి. రాత్రిపూట ఆహారాన్ని బాగా తక్కువ తీసుకొనేలా చూసుకోవాలి.తీసుకొనే ఆహారాన్ని బాగా నమిలి తినాలి, అప్పుడే అది జీర్ణమవుతుంది.

బాగా నమిలి తినాలి
- వంటల్లో ఉప్పు బాగా తక్కువుండేలా చూసుకోవాలి. రొట్టెలకి మైదా పిండిని తగ్గిచ్చి గోధుమపిండిని ఉపయోగించాలి, అలాగే గోధుమపిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోనున్న పీచుపదార్ధం శరీరానికి చాలా మంచిది.

మైదా పిండిని తగ్గిచ్చి గోధుమపిండిని
- వీలైనంతవరకు వరకు ఫాస్ట్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి. చాలావరకు తక్కువ ఆహారం తీసుకొనేలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా తీసుకొనే ఆహారంలో సింహభాగం పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న కూరగాయలను తప్పకుండ ఉండేలా చూసుకోవాలి.
చివరిగా, ప్రతిరోజూ పండ్లను లేదా పండ్లరసాన్ని తీసుకోవాలి. భోజనానంతరం ఒక గ్లాస్ మజ్జిగను, అలాగే ఒక అరటిపండును తీసుకోవాలి, ఇది జీర్ణవ్యవస్థను బాగా మెరుగు పరుస్తుంది.
Read Also: https://www.legandarywood.com