ఆసక్తిని పెంచుతున్న’పడి పడి లేచే మనసు’ ట్రైలర్ !

ప్రేమ ఇగోల ‘మసాలా’లతో సాగే పడి పడి లేచే మనసు:

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ।। సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ప్రేమ ఇగోల 'మసాలా'

ప్రేమ ఇగోల ‘మసాలా’


ట్రైలర్ మొదలవ్వగానే నా పేరు సూర్య, పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్సై యేడాది అవుతోంది. యేడాది పాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం వైశాలి, అంటూ ఈ ట్రైలర్‌ను కట్ చేసారు,
సాయిపల్లవి శూలం పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది..

 

జీవితంలో మిస్సై యేడాది

జీవితంలో మిస్సై యేడాది


ఇక ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదో ఒక కారణంతో విడిపోయి మళ్లీ కలవడం అనేది కామన్ గా సినిమాల్లో కనిపించే పాయింట్ ఈ సినిమాలో కూడా ఇద్దరూ ప్రేమించుకున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ఒకరినొకరు ప్రేమించుకున్న హీరో ।।హీరోయిన్లు వాళ్ళ ఈగో ప్రాబ్లెమ్స్‌తో దూరమవుతారు.

 

వాళ్ళ ఈగో ప్రాబ్లెమ్స్‌

వాళ్ళ ఈగో ప్రాబ్లెమ్స్‌


ఈ ఎడబాటు వాళ్లను ఎలా కలిపిందనేదే ‘పడి పడి లేచే మనసు’ స్టోరీలా కనబడుతోంది. ‘పడి పడి లేచే మనసు’ సినిమాను కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమాకు సాయిపల్లవి ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ ప్లస్ అయింది. ఈ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకువస్తుంది. మరి ఈ సినిమాతో శర్వానంద్ మరో సక్సెస్ అందుకుంటాడా ।। లేదా అనేది చూడాలి.

 

 

Read Also: https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*