ఇంగ్లీష్ టీచర్ తాప్సి @ దిల్ జంగిల్

ఇంగ్లీష్ టీచర్ తాప్సి :

 

ఇంగ్లీష్ టీచర్ తాప్సి

ఇంగ్లీష్ టీచర్ తాప్సి

 

అమ్మడు తెలుగులో కొన్నేళ్ల వరకు బాగానే ఉంది. మొదటి సారి తాప్సి ని చూసినపుడు ఈ భామ రాకతో అప్పటి స్టార్ హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అన్నట్లు టాక్ వచ్చింది. ఆమె అందం కూడా అలా ఉంది మరి. కానీ సొట్ట బుగ్గల సుందరి చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇక్కడ ఉంటే లాభం లేదు అనుకోని బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

జూడ్వా 2 సినిమాతో ఫైనల్ గా హిట్టు కొట్టి గ్లామర్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. తాప్సి మరికొన్ని రోజులు కొత్త తరహా కథతో రాబోతోంది. సఖిబ్ సలీమ్ హీరోగా ఆలేయా సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ జంగిల్ మూవీ ట్రైలర్ ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

చూస్తుంటే సినిమా పూర్తి రొమాంటిక్ కామెడీ తరహాలో రూపొందినట్లు తెలుస్తోంది.  ఫైనల్ గా సినిమా టైటిల్ ప్రకారమే జంగిల్ చుట్టూ తిరిగేలా ఉంది. ఇక కొన్ని సీన్స్ అయితే డబుల్ మీనింగ్ తో ఉన్నాయి. డైలాగ్స్ కూడా కొంచెం కామెడీతో పాటు ఘాటుగా ఉన్నాయి. ఇక తాప్సి కూడా ఎప్పుడు కనిపించని విధంగా ఈ సినిమాలో ఒక ఇంగ్లీష్ టీచర్ గా కనిపిస్తోంది.

ఈ సినిమా హిట్ అయితే గనక తాప్సి అక్కడి స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వగలదు అనేలా టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. ఫిబ్రవరి16న ఈ సినిమా రిలీజ్ కానుంది.

 

Read  Also : http://www.legandarywood.com/krishna-going-highlight-nani/

About the Author

Leave a Reply

*