ఇప్పటికి అగ్ర దర్శకులు…బాలయ్య కోసం !
వరుస చిత్రాలతో బాలకృష్ణ బిజీ బిజీ :
ఇప్పటి స్టార్ నటులు అంతా తాము ఒక చిత్రంతో బిజీగా ఉన్నప్పుడే మరో చిత్రానికి కూడా సైన్ చేసేస్తూ తమ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. వీరితో పోటీగా బాలకృష్ణ కూడా తన చిత్రాలను అలాగే ప్రణాళిక చేసుకోవడం విశేషం. ఒకపక్క రాజకీయాలు, మరో పక్క వరుస చిత్రాలతో బాలకృష్ణ మొత్తానికి ఈ వయసులో కూడా నేటి తరంతో పోటీ పడుతూ తన రెండు బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం విశేషం,

వరుస చిత్రాలతో బాలకృష్ణ బిజీ బిజీ
బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో ఒక పక్క చాలా బిజీ బిజీ గా ఉంటూనే నేటి యువ నటులతో పోటీగా మరో చిత్రం కూడా తీసేందుకు సిద్ధం అయ్యాడట. ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను తో తన సొంత నిర్మాణ సంస్థ నుండే తెరకెక్కించే పనిలో బాలయ్య ఉన్నాడట.
బాలకృష్ణకు నచ్చిన కథను కళ్యాణ్ ఎప్పటికి చెప్పెనో, తన కలను ఎప్పటికి నెరవేర్చు కొనేనా.. చూడాల్సి ఉంది. ఏమంటే బయోపిక్ చిత్రం తరువాత మళ్ళీ బోయపాటితో బాలకృష్ణ ఒక చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు.. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. అంటే ఇక కళ్యాణ్ చిత్రం తీయాలంటే ఈ రెండు పూర్తి కావాల్సిందే కదా….పోనీలే ఈ లోపు ఆయనకు మంచి కథ దొరుకుతుందేమో.
Read Also : http://www.legandarywood.com/veera-bhoga-vasanta-rayalu-first-look/