ఇస్మార్ట్ బ్యూటీ.. ఇలా అయ్యిందేంటి!

మొదట కన్నడ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నభా నటేష్ ఆ తర్వాత తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి తెలుగు సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్త గా తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో సభా పోస్ట్ చేసే ఫోటోలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంటుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కూడా అందుకుంది. అందులో ఈ బ్యూటీ చేసిన రొమాన్స్ కు మంచి క్రేజ్ అయితే వచ్చింది.

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా నాభా నటేష్ తన గ్లామర్తో మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా జీన్స్ లో నడుము అందాలను హైలెట్ చేస్తూ టాప్ లో ఒకే ఇన్నర్ తో కనిపించి కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. గ్లామర్ విషయంలో అయితే ఈ బ్యూటీకి చాలా మంచి క్రేజ్ దక్కుతోంది. కానీ గతంలో మాదిరిగా అయితే మాత్రం హీరోయిన్ గా బిజీ అవడం లేదు. చాలావరకు స్లో అయింది అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేకపోయాయి.

సోలో బ్రతుకే సో బెటర్ కరోనా కాలంలోనే కనుమరుగైపోయింది.  డిస్కో రాజా అయితే దారుణంగా దెబ్బ కొట్టింది. ఇక బెల్లంకొండ అబ్బాయి తో చేసిన అల్లుడు అదుర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మాస్టర్ సినిమా ఓటీటీ లోనే విడుదల అయినప్పటికీ కూడా పెద్దగా క్రేజ్ అయితే రాలేదు.

కెరీర్ పరంగా ఈ బ్యూటీ గతంలో కంటే చాలా స్లో అయ్యింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు కూడా లేవు. ఏదో ఒకటి రెండు ప్రాజెక్టుల పై చర్చలు సాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి కానీ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మరి ఈ గ్లామర్ ఫొటోలతో అమ్మడు ఏవైనా కొత్త ఛాన్స్ లను అందుకుంటుందో లేదో చూడాలి.

About the Author

Leave a Reply

*