ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి ‘రామ్ రామ్’ !

ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి ‘రామ్ రామ్’ :

రఘురాం రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్ తరువాత ఆర్బీఐ గవర్నర్ గా అధికారం చేపట్టారు, అప్పటినుంచి పేరుకే గవర్నర్ వెనుక అంతా తానై బీజేపీ గవర్నమెంట్ పావులు కదుపుతూ వచ్చింది. రానురాను కేంద్ర వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామాచేసారు.

 

ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి 'రామ్ రామ్'

ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి ‘రామ్ రామ్’


ఆర్బీఐకి, సెంట్రల్ గవర్నమెంట్ గత కొంతకాలంగా సైలెంట్ వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు లో ఉన్న నగదు నిల్వలలో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలంటూ వత్తిడి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉర్జిత్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసారని వినికిడి.

 

రఘురాం రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్

రఘురాం రాజన్ వారసుడిగా ఉర్జిత్ పటేల్


రాజీనామా లేఖలో అయన ప్రస్తావించిన అంశాలు ఇవే,


వ్యక్తిగత కారణాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. రిజర్వ్ బ్యాంకుకు గత కొన్నేళ్లుగా వివిధ హోదాల్లో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా. రిజర్వ్ బ్యాంక్ సాధించిన ఘనత వెనుక ఆర్బీఐ స్టాఫ్, అధికారుల కష్టం ఎంతో ఉంది. నా సహచరులు, డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. భవిష్యత్తులో వీరంతా ఆర్బీఐని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతారని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్’ అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

 

గత కొంతకాలంగా సైలెంట్ వార్

గత కొంతకాలంగా సైలెంట్ వార్

 

2016లో ఆర్బీఐ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఊర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు జరిగింది. ఈ రాజీనామా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

Read Also : http://www.legandarywood.com/

About the Author

Related Posts

Leave a Reply

*