ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్.. పాత్ర ఏంటో తెలిస్తే షాకే !

శ్రీదేవి పాత్రలో రకుల్ :

ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించడానికి సినీ నటులు విశేషమైన ఆసక్తిని చూపుతున్నారు. అదే కోవలో రకుల్ ప్రీత్ తన ఇంట్రెస్ట్‌ను చూపింది. తనకు ఇష్టమైన ప్రాజెక్ట్‌లో నటించేందుకు నందమూరి బాలకృష్ణను స్వయంగా రకుల్ సంప్రదించిందట.తనకు ఆ పాత్రలో నటించాలని ఉంది. ఒక సీన్ అయినా ఫర్వాలేదు అని తనే అడగడంతో బాలకృష్ణ ఒకే చెప్పారట. బ్రహ్మండమైన ఛాన్స్ కొట్టేసిన రకుల్,

 

శ్రీదేవి పాత్రలో రకుల్

శ్రీదేవి పాత్రలో రకుల్

 

ఎన్టీఆర్ బయోపిక్‌ సినిమాలో నటిస్తున్న సినీ తారల పేర్లు బయటకు రావడం ఆసక్తికరంగా మారుతున్నది. విద్యాబాలన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో చేరగా.. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో చేరింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోషించే పాత్ర మాత్రం సెన్సేషన్‌గా మారింది.

 

శ్రీదేవి పాత్రలో రకుల్

శ్రీదేవి పాత్రలో రకుల్

 

ఎన్టీఆర్ బయోపిక్‌లో రకుల్ బ్రహ్మండమైన ఛాన్స్‌ను కొట్టేసిందట. ఈ చిత్రంలో అందాల తార, స్వర్గీయ శ్రీదేవి పాత్రలో ఆమె కనిపించనున్నారట. యంగ్ ఎన్టీఆర్‌తో కలిసి వేటగాడు చిత్రంలో ఆకుచాటు పిందే తడిసే చిత్రంలో స్టెప్పులు వేయనున్నారట. శ్రీదేవి పాత్రలో కనిపించే అవకాశం దక్కడంపై రకుల్ చాలా ఆనందంగా ఉన్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్‌కు సినీ వర్గాల నుంచే విశేష ఆదరణ పెరగడాన్ని చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఉన్న ఆదరణ, అభిమానం ఎంత ఉందో స్పష్టమవుతున్నది. బయోపిక్‌లో నటించడానికి ముందుకొస్తున్న తీరు ఎన్టీఆర్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-rhea-chakraborty-latest-pics/

About the Author

Related Posts

Leave a Reply

*