ఎన్ని పక్కల కింద నలిగితే @ ఆఫర్స్ ..

నలుగురైదుగురు చేతుల్లో ఉంది :

 

ఎన్ని పక్కల కింద నలిగితే

ఎన్ని పక్కల కింద నలిగితే


టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని, దీనికి తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.


ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, “ఎన్ని పక్కల కింద నలిగితే ఎన్ని సినిమాలొస్తాయో నాకు తెలుసు. నా బాడీని ఎందుకు ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నా సిగ్గు లేకా? ఓన్లీ ఆఫర్స్ కోసం. లోపం మొత్తం నిర్మాతల వద్ద ఉంది. ఇండస్ట్రీ అంతా నలుగురైదుగురు చేతుల్లో ఉండిపోయింది. వీరంతా బయటికొచ్చి తెలుగమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పాలని డిమాండ్ చేసింది.


పవన్ కల్యాణ్‌గారు తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వండి. ప్రణీతలాంటి వారిని తీసుకొచ్చి మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ సమంత, ఇలియానా, తమన్నాలే కావాలా? మిగిలిన వారు పనికి రారా? ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్‌గానే ఉంటారు. తెలుగమ్మాయిలు కూడా చాలా బాగా మెయిన్‌టైన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌గారు మీరు స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతున్నారు కదా.. నేను కూడా తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలని పోరాడుతా” అంటూ ప్రకటించింది.


కొంతమంది మెయింటెనెన్స్ కోసం కాస్టింగ్ కౌచ్ బాధితులుగా మారుతున్నారని బాధపడింది. ఇంతా చేసి అన్నింటికీ ఒప్పుకున్నా ప్రధానమైన పాత్రలు రావని, ఏదో ఒక పాత్ర చెయ్యమంటారని తెలిపింది. తెలుగు సినిమాలు 100 బయటకు వస్తే 2 కూడా హిట్ కావడం లేదని, ఒక్క దానిలో కూడా నేటివిటీ ఉండదని వాపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ చూస్తున్నవారు, వెనక నాన్నల పేర్లు తగిలించుకున్న వారందరికీ ముంబై, బెంగళూరు, చెన్నై, అమ్మాయిలు కావాలని ఆరోపించింది. తెలుగమ్మాయిలు ఏం తప్పు చేశారు? వాళ్లు ఫిజిక్ మెయిన్‌‌టైన్ చెయ్యడం లేదా? ఎక్స్‌పోజ్ చెయ్యట్లేదా? హాట్‌‌గా లేరా? కోరికలు తీర్చడం లేదా? అంటూ శ్రీరెడ్డి నిలదీసింది.

 

Read Also : http://www.legandarywood.com/sketch-latest-telugu-movie-vikram-tamannah/

About the Author

Related Posts

Leave a Reply

*