ఏపీకి వెళతానన్న కెసిఆర్.. సవాల్ చేసిన కేంద్ర మంత్రి !

ఏపీకి వెళతానన్న కెసిఆర్.. సవాల్ చేసిన కేంద్ర మంత్రి.

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఉన్నవారే ముఖ్యమంత్రులుగా కొనసాగాలని ప్రముఖ నటుడు సుమన్ ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్ లో విజయంసాధించారు, రానున్న 6 నెలల్లో ఏపీలో ఎలక్షన్ జరగనున్నాయి.. ఈ సమయంలో సుమన్ చేసిన వాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రముఖ నటుడు సుమన్ ఆకాంక్ష

ప్రముఖ నటుడు సుమన్ ఆకాంక్ష


తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబు గరే సీఎం గా ఉండాలని అన్నారు.

అయన గురువారం తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తాను అనుకున్నట్లుగానే తెరాస అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబు సీఎం లు కొనసాగితేనే రెండు తెలుగు రాష్ట్రాలు మరింతగా అభివృద్ధిని సాధిస్తాయని చెప్పారు.

 

ఏపీకి వెళతానన్న కెసిఆర్

ఏపీకి వెళతానన్న కెసిఆర్


ఏపీకి వెళతానని కెసిఆర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 సీట్స్ గెలుచుకొని విజయఢంకా మోగించింది. మహాకూటమి కేవలం 21 స్థానాలకే పరిమితమైనది. ఈ నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయటంపై స్పందిస్తూ..తాను ఏపీకి వెళతానని ప్రగల్బాలు పలుకుతున్నారు. కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరొకరు మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకే ఎక్కువగా అవకాశముంది. ధర్మపురి శాసన సభ్యులు కొప్పుల ఈశ్వర్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. శాసనసభ ఎన్నికల ఫలితాలపై గవర్నర్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

 

సీఎంగా ప్రమాణ స్వీకారం

సీఎంగా ప్రమాణ స్వీకారం


మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీర్మాన ప్రతిని శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్ గౌడ్‌, దాస్యం వినయ్‌ భాస్కర్‌, గొంగడి సునీత, పద్మా దేవేందర్ రెడ్డి, రవీంద్ర కుమార్‌ తదితరులు గవర్నర్‌కు అందించారు.

అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రులు ఆపద్ధర్మ పదవులకు రాజీనామా చేశారు. ఈ లేఖలను ఎంపీ వినోద్ కుమార్‌ గవర్నర్‌కు అందించారు. గవర్నర్ వాటిని ఆమోదించారు. కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా రాజభవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో కెసిఆర్ మంత్రివర్గాన్ని ప్రకటిచనున్నారు.

 

సవాల్ చేసిన కేంద్ర మంత్రి

సవాల్ చేసిన కేంద్ర మంత్రి

ఏపీ కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కెసిఆర్ ని ఆరంజ్ లో ఆడుకున్నారు. ఏపీకి వస్తానని తెరాస అధినేత చెప్పటంపై టీడీపీ నేతలు, అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి సైతం ఓ రేంజ్ లో కెసిఆర్ ను ఏకిపడేసారు. తెలంగాణాలో టీడీపీ ఉంది కనుక తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిందని, కెసిఆర్ ఈ మొహం పెట్టుకుని ఏపీలో వేలుపెడతాని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు దమ్ముంటే 2019లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయాలని సవాల్ చేశారు.తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపై ఆమె మాట్లాడుతూ.. కూటమి ఓటమికి అనేక కారణాలున్నాయన్నారు.

Read Also : https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*