ఐడీ కార్డుతో వస్తేనే శ్రీవారి దర్శనానికి @ ఇషా రెబ్బా

టిటిడి ఆమె లెటర్‌ను పక్కన పడేసింది :

 

హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది

హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది


తిరుమల శ్రీవారి దర్శనార్థం తొలిసారి వచ్చిన హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది. సినీ నటులందరికీ ఫిల్మ్ అసోసియేషన్ తరుపున ఐడెంటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటీ కార్డును జిరాక్స్ తీసుకుని తిరుమలలోని జెఈఓ కార్యాలయంలో దర్శనం కోసం ధరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇషా రెబ్బాకు ఆ ఐడీ కార్డు లేదు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంది.


సెల్ఫ్ పేరుతో ఆమె ఒక్కరే దర్శనానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టిటిడి ఆమె లెటర్‌ను పక్కన పడేసింది. దర్సనానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక కొంతమంది టిటిడి ఉద్యోగుల సలహాతో చివరకు ఇషా రెబ్బా స్వయంగా జెఈఓ శ్రీనివాసరాజుకు ఫోన్ చేసి తనకు ఇంకా ఫిల్మ్ అసోసియేషన్ నుంచి ఐడీ కార్డు రాలేదని, తాను తిరుమలలో ఉన్నానని, దర్శనానికి అనుమతినివ్వాలని కోరింది. దీంతో జెఈఓ ఆమె గురించి తెలుసుకుని ఆ తరువాత దర్శనానికి అనుమతించారు. మరోసారి ఐడీ కార్డుతో వస్తేనే తిరుమల శ్రీవారి దర్శనానికి పంపిస్తామని తేల్చి చెప్పారు తిరుమల జెఈఓ.

 

Read Also : http://www.legandarywood.com/sketch-latest-telugu-movie-part-3-vikram-tamannah/

About the Author

Related Posts

Leave a Reply

*