కమలం ‘నేల చూపులు’.. హస్తం ‘పక్క చూపులు’ !
బీజేపీ బే’జారు’ .. లోకల్ పార్టీస్ దెబ్బకు ‘చెయ్యి’ చిత్తు:
బీజేపీ నిరంకుశ విధానాలవల్ల కంచుకోటాలు సైతం కోల్పోయే పరిస్థితికి వచ్చింది, అందుకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఉదాహరణ. ప్రజలు తమ విలువైన ఓట్ల రూపంలో సరైన సమయంలో స్పందించారు, దాని ఫలితమే నేటి దారుణమైన పరాభవం. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌తో రాజస్థాన్ ఎన్నికలు వారికీ పీడ కలను మిగిల్చాయి.

బీజేపీ బే’జారు‘
తెలంగాణలో సైతం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా, అటు ఈశాన్య రాష్ట్రం మిజోరంలోనూ అదే పరిస్థితి ఎదురైంది.చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా.. రాజస్థాన్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజార్టీని సాధించింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరిగినా.. చివరికి కాంగ్రెసే పైచేయి సాధించింది.

లోకల్ పార్టీస్ దెబ్బకు ‘చెయ్యి’ చిత్తు
మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ విడిపోయిన తరువాత నుంచి బీజేపీ కంచుకోటగా ఉంది, వరసగా మూడుసార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొనివచ్చిన సీఎం రమణ్‌సింగ్ సైతం ఈ ఎలక్షన్ లో కింద మీద పడుతూ విజయం పొందే పరిస్థితికి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 17 స్థానాలతో సరిపెట్టుకుంది. అలాగే రాజస్థాన్‌లో 72 స్థానాల్లో గెలవగా.. మధ్యప్రదేశ్‌లో మూడంకెల స్కోరును అందుకుంది.

కమలం ‘నేల చూపులు’.. హస్తం ‘పక్క చూపులు
అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం మోడీ ప్రతిష్టను మరింతగా దిగజార్చేదే. పైగా ఈ ఎన్నికలు వచ్చే సంవత్సరం
2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించనుంది.
Read Also : http://www.legandarywood.com/