కాజల్ లక్కీ ఛాన్స్ రజినీకాంత్ తో?

అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం :

రజినీకాంత్ సినిమాలో సైడ్ రోల్ లో అవకాశం దొరికినా కూడా ఒప్పుకునే బ్యూటీలు చాలా మంది ఉంటారు. ఇక కాజల్ కూడా అదే ఆలోచనతో ఉందట. తన పదేళ్ల కెరీర్ లో అమ్మడు దాదాపు సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరిని కవర్ చేసేసింది. రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ తోనే చిందులు వేసింది. ఇక ఇప్పుడు లక్కీగా రజినీకాంత్ తో జత కట్టడానికి సిద్ధమైంది,

 

అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం

అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం

 

ఎంతవరకు నిజమో చెప్పలేము గాని కొంత మంది సీనియర్ హీరోయిన్స్ మాంత్రం ఇప్పుడు కొన్ని సినిమాలకు స్పెషల్ గా సెలెక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కొంత మంది స్టార్ హీరోలకు కొత్త భామలను సెట్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. కొత్త సెలక్షన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పడం కష్టం.

అందుకే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు రిస్క్ ఎందుకని సీనియర్ హీరోయిన్ కాజల్ ను సెలెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.

అందుకు సంబందించిన వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ రజినీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించే అవకాశం ఉందట. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఈ చందమామ కోలీవుడ్ లో బాలీవుడ్ క్వీన్ రీమేక్  పారిస్ పారిస్ అనే సినిమా చేస్తోంది.

 

Read Also : http://www.legandarywood.com/hottie-reveals-tip-free/

About the Author

Related Posts

Leave a Reply

*