కురుల అందానికీ..చర్మానికీ.. కాఫీ పొడి
కురుల అందానికీ..చర్మానికీ.. కాఫీ పొడి :
జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే రెండు చెంచాల కాఫీ పొడిలో, మూడు చెంచాల ఆలివ్‌నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని, మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది,

కురుల అందానికీ..చర్మానికీ.. కాఫీ పొడి
కాఫీ పొడిలో ఉండే కెఫిన్ కేవలం మానసిక ఆరోగ్యానికే కాదండోరు, కురుల అందానికీ ఉపయోగపడుతుంది. కాఫీ పొడి చర్మానికీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ముఖం మీద మొటిమలు ఎర్రబడి, వాపు వచ్చినప్పుడు వాటిని నివారించేందుకు కాఫీపొడి సహాయపడుతుంది. కాఫీ గింజలను గ్రైండ్ చేసుకొని, దాంట్లో చిటికెడు ఉప్పు, ఆలివ్‌నూనె కలపాలి. ఇది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది.
రెండు చెంచాల పెరుగులో చెంచా స్ట్రాబెర్రీ రసం, చెంచా కాఫీపొడి కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.
Read Also : http://www.legandarywood.com/photo-shoot-sneha-latest-hot-poses/