కేంద్రం.. పోలవరం నిధుల్లో కోత

పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత :

 

పోలవరం నిధుల్లో కోత

పోలవరం నిధుల్లో కోత


పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది.

పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ప్రస్తుతం విభజన చట్టంలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ, వామపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రం పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత పెట్టడంతో పుండుమీద కారం చల్లినట్టయింది.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-kalas-beauty-red-hot-bikini/

About the Author

Related Posts

Leave a Reply

*