కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై సీనియర్ నటి కామెంట్స్..!

సీనియర్ నటి కస్తూరి శంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘అన్నమయ్య’ ‘సోగ్గాడి పెళ్ళాం’ ‘ఆకాశ వీధిలో’ వంటి చిత్రాలతో అలరించిన కస్తూరి.. తెలుగుతో పాటు తమిళ కన్నడ మళయాల భాషల్లో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించిన కస్తూరి.. వెండితెర నుంచి ఇప్పుడు బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ సీరియల్ లో నటిస్తూ తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కస్తూరి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సీనియర్ నటి.. అన్ని విషయాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది.

ఈ క్రమంలో పలు వివాదాలు కూడా కొనితెచ్చుకుంది. అయితే ఇప్పుడు లేటెస్టుగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై కస్తూరి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఓ అండర్ వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్.. తాజాగా దానికి సంబంధించిన ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు.

సాధారణంగా పాపులర్ క్రికెటర్లు ఇలాంటి ఇన్నర్ వేర్ యాడ్స్ చేయడానికి పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం ధైర్యంగా యాడ్ చేశారు. ఇదే విషయం మీద కస్తూరి.. కేఎల్ రాహుల్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. అతని ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుందని ఆమె తెలిపింది.

”క్రికెటర్లు కూల్ డ్రింక్స్ – చిప్స్ – ఆన్లైన్ గేమ్స్ మరియు బ్రాండ్లకు ప్రచారం చేయడం మనం చూస్తుంటాం. చాలా మంది భారతీయ క్రీడాకారులు దుస్తుల బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తారు. కానీ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు వెనకడతారు. కాబట్టి బాక్సర్లలో కెఎల్ రాహుల్ బఫ్ గా కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని కస్తూరి ట్వీట్ చేసింది.

About the Author

Leave a Reply

*