కేన్సర్ తో పోరాడే ‘పోతీస్’ మొక్క !
కేన్సర్ తో పోరాడే ‘పోతీస్’ మొక్క:
కేన్సర్ ముఖ్యంగా జంక్‌ఫుడ్స్ తీసుకోవడం, పొగ తాగడం, గుట్కా, పాన్ మసాలాలు నమలడం.. మారిన జీవనవిధానం.. ఇళ్లు, పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా.. మనకు తెలియకుండానే గాల్లోని కొన్ని మాలిక్యూల్స్ వల్ల కూడా కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. క్లోరోఫాం, బెంజీన్ మాలిక్యూల్స్ ఆ కోవలోవే.

‘పోతీస్’ మొక్క
క్లోరినేషన్ బాయిల్డ్ ట్యాప్ వాటర్‌తో స్నానం చేసేటప్పుడు సూక్ష్మ పరిమాణంలో గల క్లోరోఫాం మాలిక్యూల్స్ చర్మం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి.
ఇళ్ల ముందు పార్క్ చేసే వాహనాల్లోని ఇంధనాల నుంచి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
కేన్సర్ కారక కాలుష్యాలను తరిమికొట్టగల ‘పోతోస్’ అనే మొక్కను జన్యుపరంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే పోతోస్ మొక్క.. ఈ మాలిక్యూల్స్‌ను తొలగిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్లోరోఫాం, బెంజీన్ ఇతర కాలుష్య కారకాలను ఈ మొక్కలు పీల్చుకొని తమ ఎదుగుల కోసం ఉపయోగించుకుని.

కేన్సర్ కారక కాలుష్యాలను
2-ఈవన్ ప్రోటిన్‌ను గాల్లోకి విడుదల చేస్తాయని దీనిపై పరిశోధనలు చేసిన వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టూవర్ట్ స్టాండ్ తెలిపారు. మనిషి శరీరంలోనూ 2-ఈవన్ ఉంటుందని.. ఇది బెంజిన్‌ను ఫినాల్‌గానూ, క్లోరోఫాంను కార్బన్‌డయాక్సైడ్‌గానూ మార్చుతుందన్నారు.
2-ఈవన్ లీవర్‌లోనూ ఉంటుందని.. మద్యం తీసుకున్నప్పుడు ఈ ప్రోటీన్ పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. మనిషి శరీరంలో చోటుచేసుకునే ఈ ప్రక్రియను బయట మొక్కల్లోనూ జరపాలని నిర్ణయించి సక్సెస్ అయ్యామని తెలిపారు..
అయితే పూర్తిస్థాయిలో కాలుష్య కారకాలను తరిమేసే హౌస్‌ప్లాంట్లను తాము అభివృద్ధి చేశామని ప్రొఫెసర్ స్టూవర్ట్ స్టాండ్ వెల్లడించారు.
Read Also: https://www.legandarywood.com