కో పైలట్‌పై అత్యాచారం..అమెరికాలో రచ్చ రచ్చ

ఎయిర్‌లైన్స్‌ కో పైలట్‌పై అత్యాచారం :

 

ఎయిర్‌లైన్స్‌ కో పైలట్‌పై అత్యాచారం

ఎయిర్‌లైన్స్‌ కో పైలట్‌పై అత్యాచారం


తాజాగా అలస్కా ఎయిర్‌లైన్స్‌ కో పైలట్‌పై కూడా అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే, అలస్కా ఎయిర్‌లైన్స్ కెప్టెన్.. తనకు మత్తుమందిచ్చి రేప్ చేశాడని కో పైలట్ బెట్టీ పీనా ఆరోపించింది. విమానం డ్యూటీలు మారే నిమిత్తం మిన్నేపోలీస్‌లో విశ్రాంతి తీసుకున్నానని.. మూడు రోజుల పాటు అలస్కా ఎయిర్‌లైన్స్ కెప్టెన్‌తో పనిచేయాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది.

అయితే ఓ రోజు రాత్రి ఒక గ్లాస్ వైన్ తీసుకున్నానని.. రెండో గ్లాస్ చేతిలో తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పింది. మెళకువ వచ్చి చూసేలోపు.. బెడ్‌పై వాంతులు చేసుకున్న స్థితిలో వున్నానని.. ఇంకా తన లోదుస్తులు తొలగించి వున్నాయని చెప్పింది. అప్పటికే కెప్టెన్ మత్తుమందిచ్చి తనపై అత్యాచారం చేశాడని తెలుసుకున్నానని తెలిపింది.

దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కెప్టెన్‌ను విధుల్లో కొనసాగిస్తున్నారని చెప్పింది. గతంలో సైన్యంలోనూ పని చేసిన పినా, ఇటువంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని ఆరోపించింది. ఇదే తొలికేసు కాదని, ఇదే చివరి కేసు కూడా కాదన్న సంగతి తనకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇకపోతే.. పినా దాఖలు చేసిన లాసూట్‌పై ప్రస్తుతం అమెరికాలో రచ్చ రచ్చ జరుగుతోంది. పినాపై అఘాయిత్యానికి పాల్పడిన కెప్టెన్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-two-legends/

About the Author

Leave a Reply

*