చిరునవ్వులతో ఐఫాలో స్టార్ డాటర్ దోపిడీ

సారా అలీఖాన్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. తండ్రికి తగ్గ తనయగా నటనలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ `మామ్` అమృత సింగ్ ని మించి యూనిక్ క్వాలిటీస్ తో యువతరంలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ స్టార్ల సరసన నటిస్తున్న ఈ పటౌడీ సంస్థాన వారసురాలు ఎంతో హంబుల్ నేచుర్ తో ఆకట్టుకుంటుంది. సారా తాజాగా ఐఫా ఉత్సవాల్లో అదిరిపోయే ఫోజులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

అవార్డ్ వేడుకల్లో బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ లుక్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సల్మాన్ భాయ్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లు అటెండయిన ఈ వేడుకలో సారా పైనే కళ్లన్నీ నిలిచాయంటే తన డ్రెస్సింగ్ సెన్స్ ఎంతగా ఆకట్టుకుందో  అర్థం చేసుకోవాలి.

అబుదాబిలో జరిగిన తాజా ఈవెంట్ లో ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ సారా తన మనసులోని కోరికలను కూడా వెల్లడించింది. సారా ఈ వేదికపై ధనార్జన.. విజయ గర్వం గురించి అంతగా పట్టించుకోనని నటిగా ఎలా ఎదగాలన్నదే తన ఆశయమని వెల్లడించింది. హిట్ లు ఫ్లాపులు నటీనటులను ప్రేరేపించే భారీ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పట్టించుకోనని తెలిపింది.

సారా మాట్లాడుతూ-“బాక్సాఫీస్ కలెక్షన్ లు నిర్మాతలకు వెళ్తాయి.. హమ్ కో కుచ్ నహీ మిల్తా (మాకు ఏవీ దక్కవు). కాబట్టి మాకు నటన చాలా ముఖ్యం. స్థిరత్వంతో నిజాయితీతో పని చేయాలి. అంతకుమించి మనం నియంత్రించగలిగేది ఇంకేమీ లేదు. ఒక నటిగానిజాయితీగా ఉండటం ముఖ్యం. ప్రేక్షకుల ప్రేమ చాలా ముఖ్యం. ఆ ప్రశంసలు ఏ భాషలో వచ్చినా పట్టింపు లేదు“ అంటూ ఎంతో వినయంగా మాట్లాడి అందరి మనసులు దోచుకుంది.

సారా నటించిన అట్రాంగి రే నేరుగా OTTలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ నెటిజనుల్లో చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సారా తన నటనకు ప్రశంసలు దక్కాయి. అట్రాంగి రే విజయం తర్వాత సారా తన భవిష్యత్ ప్రాజెక్ట్ ల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. “నేను దేనినీ ఎంపిక చేయను. అయితే అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. సగం కథలు చెప్పేవారితో కాకుండా పూర్తి కథలు చెప్పేవారితో పని చేయాలనుంది. ఇప్పుడు నేను మంచి పని చేయాలనే కోరికను పెంచుకున్నాను“ అని అంది.

సారాను మీరు చేయాల్సిన డ్రీమ్ రోల్స్ ఏమిటి? అంటూ ప్రశ్నించగా.. “నేను సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో రాణిగా నటించాలనుకుంటున్నాను. లేదా జోయా అక్తర్ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటించాలనుకుంటున్నాను. అవి నా డ్రీమ్ రోల్స్“ అని సారా చెప్పింది. లక్ష్మణ్ ఉటేకర్- విక్కీ కౌశల్ తో జతకట్టిన అనుభవం గురించి మాట్లాడుతూ-“విక్కీ కౌశల్ తో కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా ప్రతిభావంతుడు. చాలా సులభంగా దూసుకెళతాడు. తనతో పని చేయడం చాలా సరదాగా ఉంటుంది“ అని తెలిపింది.

About the Author

Leave a Reply

*