చెవుల్లో పువ్వులు పెట్టడంలో మోదీ తర్వాతే ఎవరైనా !
చెవుల్లో పువ్వులు పెట్టడంలో నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా :
ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రధాని మోదీ కూడబెట్టుకున్న ఆస్తులు ఎంతో తెలుసా.. ? అక్షరాలా రూ.2.28కోట్లు. అయినా కనీసం సొంత కారు కూడా లేదట. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి,

చెవుల్లో పువ్వులు పెట్టడంలో నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా
సాధారణంగా ప్రముఖల ఆస్తుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి సామాన్య ప్రజల్లో ఉండటం సహజమే. అదే తనను చాయ్‌వాలాగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మరీ ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా పీఎంవో మోదీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించింది. మార్చి 31,2018 వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ వివరాలను వెల్లడించింది.

చెవుల్లో పువ్వులు పెట్టడంలో నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా
చెవుల్లో పువ్వులు, బండరాళ్లు.. ఇంకేమైన పెట్టడంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. ఇప్పుడీ లిస్టులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేరిపోయాడని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొంటున్నారు. ఇంతకీ మోడీ పెట్టిన ఆ పువ్వేంటో తెలుసా.. ? మోదీ పేరుపై కనీసం సొంత కారు కూడా లేదట. ఛాయ్‌వాలాగా జీవితాన్ని ఆరంభించి ప్రధానమంత్రిగా ఎదిగారు నరేంద్రమోదీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రధానిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు.

చెవుల్లో పువ్వులు పెట్టడంలో నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా
పీఎంవో లెక్కల ప్రకారం :
మోదీ ఆస్తుల విలువ రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువ. వివిధ బ్యాంకుల్లో కోటి రూపాయల నగదు ఉండగా మోదీ వద్ద 50వేల రూపాయల నగదు ఉన్నట్టు పేర్కొంది.
మోదీకి సొంతంగా ఒక కారు గానీ, బైకు గానీ లేవని తెలిపింది. అలాగే ఆయన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని స్పష్టం చేసింది.
మోదీ వద్ద ఉన్న నగదు- రూ. 48,944
గాంధీనగర్ స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్- రూ.11,29,690
మరో ఎస్బీఐ అకౌంట్‌లో- రూ.1,07,96,288
ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రా బాండ్(ప్రస్తుత విలువ)- రూ. 20,000
జాతీయ పొదుపు పత్రం బాండ్ విలువ- రూ. 5,18,235
జీవిత బీమా పాలసీ- రూ. 1,59,281
మోదీ వద్ద ఉన్న బంగారం విలువ(కేవలం 4 ఉంగరాలు) – రూ.1,38,060
గాంధీనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో మోదీకి నాలుగో వంతు వాటా ఉంది. 2002లో 1,30,488 రూపాయలకు ప్రధాని కొనుగోలు చేశారు.
Read Also : https://www.legandarywood.com/photo-story-bruna-hot-sizzling-red-bikini/