చేతులు వణుకుతుంటే ఈ సమస్య ఉందో చెక్ చేయాలట..

కొన్ని పరిశోధనల ప్రకారం పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందో సరైన ఆధారాలు లేవు. వయస్సు, జన్యు, పర్యావరణ కారకాల కలయిక కారణంగా డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలు చనిపోయేలా చేస్తుంది. నిపుణుల ప్రకారం దాదాపు 500 మందిలో ఒకరు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. స్త్రీల కంటే పురుషులకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మెదడు కదలికలను సరిగ్గా నియంత్రించడానికి తగినంత డొపమైన్ తయారు కానప్పుడు పార్కిన్సన్స్ వస్తుంది. దీని లక్షణాలు ఒకటి చేతుల్లో వణుకు. సరిగ్గా నిలబడలేరు, కూర్చోలేరు. బ్యాలెన్సింగ్ లేకపోవడం ఈ వ్యాధి మరో లక్షణం.

పార్కిన్సన్స్ ఆటోమేటిగ్గా మన కదలికలపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి పోశ్చర్ ఎలా ఉండాలనే దాన్ని బ్రెయిన్ మర్చిపోతుంది. దీంతో చాలా మంది తమ శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేరు. వంగిపోతారు. భుజాలు గుండ్రంగా మారుతాయి. తల, మొత్తం శరీరం ముందుకు సాగిపోతాయి. శరీరం వంకరగా కనిపించేలా ఉంటుంది. పార్కిన్సన్స్ ఉంటే ముందుకు వంగి నడుస్తుంటారు. మెల్లిగా చేతులు ఊపుతుంటారు. ఇది రాను రాను పెరుగుతుంది. కదలికల్లో మార్పులు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయి. పార్కిన్సన్స్ శరీరంలో ఒక వైపు నుండి ప్రారంభమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ శరీరానికి రెండువైపులా ఉంటాయి. లక్షణాలు ముదురుతాయి.

ముఖ్య లక్షణాలివే..

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాల్లో వణుకు, నెమ్మదిగా కదలడం, పట్టుత్వం, వాసనం కోల్పోవడం, మలబద్ధకం, నిరాశగా ఉండడం, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఆహారాన్ని నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది. మూత్ర, చర్మ సమస్యలు కూడా ఉంటాయి. దురదృష్టవశాత్తు పార్కిన్సన్స్ వ్యాధికి ఎటువంటి ట్రీట్‌మెంట్ లేదు. రోగులకు సరైన ట్రీట్‌మెంట్, జాగ్రత్తల గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం చాలా మంచిది.

వ్యాయామం కూడా..

వారానికి రెండున్నర గంటల పాటు వర్కౌట్ చేయడం వల్ల చాలా వరకూ సమస్య రాకుండా, వచ్చినా కంట్రోల్లో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల కేవలం ఈ సమస్యే కాదు చాలా సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండాలి. ఒక వేళ అది కుదరకపోతే నడక అయినా ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ వయసు వచ్చాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About the Author

Leave a Reply

*