జాతీయ మీడియా ‘సర్వే’ల ‘మాయ’ !

జాతీయ మీడియా ‘సర్వే’ల ‘మాయ’ :

రానున్న నాలుగైదు నెలలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి… ఇటీవలి కాలంలో జాతీయ మీడియా ఛానెళ్ళు నెలకోసారి దేశవ్యాప్త సర్వేలు అంటూ హడావుడి చేస్తుంటాయి. అయితే ఈ సర్వేలు నిజంగానే పబ్లిక్ పల్స్ ను అంచనా వెయ్యగలవా అంటే,

జాతీయ మీడియా 'సర్వే'

జాతీయ మీడియా ‘సర్వే’

 

చరిత్ర చూస్తే దక్షిణాదిన అందునా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఈ సర్వేలు అంతగా ఖచ్చితంగా లేవని చెప్పక తప్పదు.

 

టీడీపీ + కాంగ్రెస్

టీడీపీ + కాంగ్రెస్

తాజాగా రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం వైకాపాకు 14 సీట్లు, టీడీపీ + కాంగ్రెస్ కు 11 సీట్లు వస్తాయని చెప్పింది. వైకాపాకు 41.8% ఓటు షేర్ ఇవ్వగా టీడీపీ + కాంగ్రెస్ కు 38.2% ఇచ్చింది. ఇది ఎలా ఉన్నా బీజేపీకి ఏకంగా 10% ఓటు ఉందని చెప్పడం మరీ విడ్డురం. ఇదే సమయంలో అసలు జనసేనను పట్టించుకోకుండా ఆ పార్టీని ఇతరులలోకి గెంటేసి నామమాత్రంగా 9.3%. ఇతరులలో ఇండిపెండెంట్లు, కమ్యూనిస్టులు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలి.

 

ఆంధ్రప్రదేశ్ లో పతనావస్థ

ఆంధ్రప్రదేశ్ లో పతనావస్థ

 

మొత్తంగా జనసేనను ప్రస్తావించకున్నా.. బీజేపీ కంటే తక్కువ రావడం అంటే కలల లోకంలో విహరించటమే.

బీజేపీ ఎంతో కొంత బలంగా.. మంచి కాండిడేట్లను నిలబెట్టగలి ఉన్న .. తెలంగాణాలోనే చిత్తుగా ఓడిపోయింది. మొత్తంగా అక్కడ ఆ పార్టీకి వచ్చింది 8% ఓటు. ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పతనావస్థలో వుంది. దీనిని బట్టి జాతీయ మీడియా సర్వేలు తమ అంచనాలలో తడబడుతున్నాయా లేకపోతే ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీ ఓడిపోతుంది అనే రూమర్స్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయనుకోవాలా ?

 

Read Also: https://www.legandarywood.com

 

About the Author

Related Posts

Leave a Reply

*