ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు చేసిన బరాక్ ఒబామా

మీ గొంతును బలంగా వినిపించండి :

దక్షిణాఫ్రికా జాతి వివక్ష పోరాట యోధుడు నెల్సన్ మండేలా శతజయంతి సందర్భంగా నెల్సన్ మండేలా ఫౌండేషన్ కార్యక్రమంలో ఒబామా ప్రసంగించారు. అందులోని అయిదు ముఖ్యాంశాలు,

 

మీ గొంతును బలంగా వినిపించండి

మీ గొంతును బలంగా వినిపించండి

 

పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఒబామా తప్పుబట్టారు. కళ్ల ముందు కనిపించే వాస్తవాలను అంగీకరించాలన్నారు. “ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. కొందరికి అది కనిపించకపోవడం హాస్యాస్పదం.”

“సమాజంలో అంతరాలు తొలగిపోవాలంటే ప్రతిఒక్కరని భాగస్వాములు చేయాలి. అందరి శక్తియుక్తుల మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. విశ్వసమరంలో విజేతగా నిలిచిన ఫ్రెంచ్ ఫుట్‌బాల్ జట్టును చూడండి. ఆ జట్టులో గాలియన్లు (పశ్చిమ యూరప్‌లోని ఒక జాతి ప్రజలు) మాత్రమే లేరు. అయినా వారంతా ఫ్రెంచ్ జాతీయులు. అమెరికాలో, దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష ఇప్పటికీ ఉందన్నది దాచలేని వాస్తవం. “

 

మీ గొంతును బలంగా వినిపించండి

మీ గొంతును బలంగా వినిపించండి

 

“ప్రపంచవ్యాప్తంగా శ్రీమంతులు పేదలకు దూరమవుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పేదల బతుకులను సంపన్నులు అర్థం చేసుకోవడం లేదు. అందుకే వారు కంపెనీలను ఇష్టారీతిలో మూసివేస్తుంటారు. కంపెనీ వాటాదార్లకు మాత్రమే జవాబుదారీగా ఉంటే చాలని భావిస్తుంటారు. “

“భయపెట్టడం, ఆగ్రహం, తక్కువ చేసి చూడం మునుపెన్నడూ లేనివిధంగా నేడు రాజకీయాల్లో పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని సమస్యలున్నాయి. అంతమాత్రానా నియంతృత్వం సరైనది కాదు. నెల్సన్ మండేలా బోధనలు నేడు ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. శాంతి, సామరస్యం మండేలా సిద్ధాంతాలతోనే సాధ్యం.

ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు విజయపథంలో ముందుకు సాగుతున్నాయంటే అందుకు కారణం ప్రగతిశీల భావనలే. తాత్కాలికంగా సమస్యలు ఎదురు కావొచ్చు.కానీ చివరకు సత్యమే గెలుస్తుంది. “

“యువత నమ్మకం కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ గొంతును బలంగా వినిపించండి. ప్రపంచానికి ఒక్క నాయకత్వం మాత్రమే సరిపోదు. అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలి.

అణచివేతను ఎదుర్కొని స్వేచ్ఛా బావుటను ఎగరవేసే శక్తి యువతకు ఉందని నెల్సన్ మండేలా చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. యువత ధైర్యంగా ముందుకు కదలాలి. “

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-katrina-kaif-latest-hot-poses/

About the Author

Related Posts

Leave a Reply

*