తెరాస ఆపరేషన్ ‘ఆకర్ష్’ టీడీపీతో ‘పరేషాన్ ‘ !
తెరాస ఆపరేషన్ ‘ఆకర్ష్’ టీడీపీతో ‘పరేషాన్ ‘:
తెరాస ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తనకు ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమేనని టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. తనకు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వరరావు పిలిస్తేనే ఆ పార్టీలోకి వెళ్లలేదని, ఇప్పుడెలా వెళ్తానని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ టీడీపీలోనే ఉన్నానన్న ఆయన,

టీడీపీతో ‘పరేషాన్ ‘
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని అన్నారు. అశ్వారావుపేటలో చిన్నకార్ల యజమానుల యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారితేనే అభివృద్దా
తెరాస నుంచి ఆఫర్లు వచ్చిన వాటిని తిరస్కరించినట్టు అయన అన్నారు. పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా ? లేకపోతే చేయరా? అని అయన ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లైనా న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రతిపక్షాలు లేకుండా పోతే, అది ప్రజాస్వామ్యం కాబోదన్నారు.
ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనను గెలిపించిన ఓటర్లకు కృతఙ్ఞతలు చెబుతూ, అందరి కోసం తాను పనిచేస్తానని మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: https://www.legandarywood.com