దేవీ భాగవత ‘మణి’ద్వీప వర్ణన ‘పఠిస్తే’ !

దేవీ భాగవత ‘మణి’ద్వీప వర్ణన ‘పఠిస్తే’ :

బ్రహ్మలోకానికి పైన సర్వలోకం విరాజిల్లుతుంటుంది.. దానినే మణిద్వీపమంటారు.అక్కడే శ్రీదేవి నివాసముంటుంది. సమస్తలోకాలకన్నా అధికమైనది కావటం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు.

అంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికి పూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు స్థానంగా ఏర్పరచుకుంది.

మణిద్వీపం కైలాసంకన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకంకంటే శ్రేష్ఠంగా భాసిల్లితుంటుంది.. అందుకే దానిని సర్వలోకం అంటారు.

 

మణి'ద్వీప వర్ణన

మణి’ద్వీప వర్ణన

 

సుదీర్ఘమైన ఆ తీరంలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి. ఆ ప్రదేశానికి ఆవలి భాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంగల దృఢమైన లోహమయ ప్రాకారము ఉంది.

నానాశాస్త్రాస్త్రాలను ధరించి పోరాడడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలాకాస్తూ ఉంటారు. ప్రతీ ద్వారంలోను వందలకొలది భాతులుంటారు.

 

 రత్నవృక్ష పంక్తులు

రత్నవృక్ష పంక్తులు

 

అక్కడే శ్రీదేవి భక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తుంటారు. వారు దివ్య వాహనాలపై వస్తూపోతుంటారు.వారి అసంఖ్యాక విమానాదుల, గంటల చప్పుళ్ళు వారి గుర్రాల సకిలింపులు , వాటి డెక్కల ధ్వనులూ దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగుతుంటాయి.

అక్కడి దేవీ జనాదులు వేత్ర పాణులై గోలచేయకండి అంటూ దేవా సేవకులను దండిస్తుంటారు. ఆ మహాకోలాహలాల మధ్యభాగంలో ఎవరు ఏ చప్పుడు చేసినా తెలియదు. అక్కడ అడుగడుక్కీ స్వచ్ఛశీతల, మధురజల సంభరిత సరోవరాలున్నాయి. ఆచోటనే రత్నమయ వృక్షసంభరితమైన ఉద్యానవనాలున్నాయి. అట్టి మణిద్వీపంలో మధుర నాదాలు ప్రతిద్వనించ మధువును స్రవింపచేసే తరుసమూహాలు అలరారుతుంటాయి.

 

శ్రీదేవి భక్తులు గణాలుగా

శ్రీదేవి భక్తులు గణాలుగా

ఆ కాంస్య ప్రాకారందాటగా లోపలివైపు తామ్రప్రాకారం ఉంది. చతురస్రాకారంగా ఉన్న అది చతురస్రాకారంగా సప్తయోజనాల ఔన్నత్యం కలిగి అది భాసిల్లుతూంటుంది.

కాంస్య ప్రాకారాల మధ్యలో కల్ప వనాలున్నాయి. తారు వికసిత పుష్పాలు సువర్ణ పుష్ప సమంగా భాసిల్లుతుంటాయి. వాటి పత్రాలు సువర్ణ పత్రాలుగా భీజాఫలాలు రత్నాలవలే, సొంపుకురుస్తూ ఉంటాయి. ఆ తారు బహిర్గత సుగంధం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కల్పవనంలో వసంతేజుడు కొలువై అహోరాత్రులు వసంత శోభలను వ్యాపింపజేస్తుంటాడు. మధుశ్రీ, మాధవశ్రీలు ఇరువురి భార్యలతో పుష్పసింహాసనంపై ఉంటాడు.

 

తామ్రప్రాకారం

తామ్రప్రాకారం


సదా మందస్మిత వదనారవిందాలతో అలరారే భార్యలతోకూడి వసంతుడు పూలబంతులతో క్రీడిస్తుంటాడు. అక్కడి సుగంధాలు దశయోజన పర్యంతం వ్యాపించి ఉంటాయి.సుగంధభరితమైన ఆ వనాలలో గాన లాలసలైన గాంధర్వ కామినీజన గాదలినాలలో గంధర్వ యువకులు సయ్యాటలాడుతుంటారు.మత్తకోయిలల కలకలరావాలతో వసంత శ్రీ శోభాలతో ఆ దివ్యావనం కాముకులు కామోద్రేకాన్ని వర్ధిల్లజేస్తుంటుంది.

అందలి ప్రతీశక్తి అగణిత బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలదు. అట్టి మహాసైన్యాలను వర్ణించగలమా.. అక్కడ ఉన్న రథ వాహినులకు లెక్కయేలేదు . వారందరు శ్రేదేవికై యుద్ధం చేయ సన్నద్ధులై ఉంటారు.

 

వదనారవిందాలతో

వదనారవిందాలతో


వారి నామాలివి.. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి,కూహూ, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బ్యాధిధ, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్థిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, శుంభ, నిశుంభమదిని, మహిషాసురమర్ధిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధశరీరిణీ,నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి వీరకృద్ధులైతే సమస్త బ్రహ్మాండాలను నాశనం చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు అపజయాన్ని అంగీకరించరు.

ఈ నామాలు మహాశక్తివంతాలు.. రోజూ పఠించటం వలన.. సర్వపాపాల నుంచి విముక్తులవుతారు.. మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది.

 

Read Also : https://www.legandarywood.com

 

About the Author

Leave a Reply

*