ధోనీ రిటైర్‌మెంట్‌కి సూచనగా ?
రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రమంలోనూ ధోనీ :
తాజాగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ చెలరేగిపోయాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. దీంతో ధోనీ తిరిగి ఫాంలోకి వచ్చేశాడని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ధోనీ చెత్త ప్రదర్శనకే పరిమితమయ్యాడు. దీంతో ధోనీ రిటైర్‌మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఓ ఘటన ధోనీ రిటైర్‌మెంట్‌ని సూచిస్తున్నట్లు కనిపించింది. హెడ్డింగ్లే వన్డే ముగిసిన తర్వాత ధోనీ అంపైర్ల నుంచి ఆ మ్యాచ్‌లో ఉపయోగించిన బంతిని అడిగి తీసుకున్నాడు. గతంలో టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రమంలోనూ ధోనీ అతని చివరి మ్యాచ్‌లో ఉపయోగించిన వికెట్ బెయిల్స్‌ని అడిగి తీసుకొని.. అనంతరం రిటైర్‌మెంట్ ప్రకటించాడు,

రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రమంలోనూ ధోనీ
జోరూట్ అజేయ శతకం.. మోర్గన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికంటే మరో ఘటన ఇండియా క్రికెట్ అభిమానుల్ని కలవరపెడుతుంది. అదేంటంటే.. మ్యాచ్‌లో ఉపయోగించిన బంతిని జట్టు కీపర్-బ్యాట్స్‌మెన్ ధోనీ అంపైర్ల నుంచి అడిగి తీసుకున్నాడు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్తున్నాడని ఇప్పుడు పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి.
మహేంద్రసింగ్ ధోనీ.. టీం ఇండియాకు ఎన్నో మరిచిపోలేని విజయాలు అందించిన కెప్టెన్. భారత క్రికెట్ అభిమానులు దాదాపు 28 సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రపంచకప్‌ని దేశానికి అందించిన క్రికెటర్. అయితే గత కొంతకాలంగా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించడం లేదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే భారీ స్కోర్ చేస్తున్నాడు.
అయితే ఫీల్డింగ్, కీపింగ్ పరంగా మాత్రం అతను మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇంకా అతని అనుభవంతో జట్టు సభ్యులకు సలహాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ.. ధోనీ ఇక రిటైర్‌మెంట్ ప్రకటించి యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించాలని ఎప్పటినుంచో వాదనలు వినిపిస్తున్నాయి. కానీ జట్టు సభ్యుల నుంచి మాత్రం ధోనీకి ఎప్పటికప్పుడు మద్దతు లభిస్తూనే ఉంది.
ఇప్పుడు మూడో వన్డేలో ఉపయోగించిన బంతిని ధోనీ అడిగి తీసుకోవడంతో అతను త్వరలో రిటైర్ అవుతున్నాడని ఊహగానాలు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అంతేకాక టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు కూడా ధోనీ తెల్లగడ్డంతో కనిపించాడు. ఈ సిరీస్‌లోనూ పూర్తి తెల్ల గడ్డంతో కనిపిస్తున్నాడు. దీంతో ఇది కూడా ధోనీ రిటైర్‌మెంట్‌కి సూచనగా అభిమానులు భావిస్తున్నారు. కానీ మరో వర్గం అభిమానులు మాత్రం ధోనీ మామూలుగానే బంతిని తీసుకున్నాడని.. రిటైర్‌మెంట్ వంటి ఆలోచనలు అతనికి లేవని వాదిస్తున్నారు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ కచ్చితంగా జట్టులో కొనసాగుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also : http://www.legandarywood.com/photo-shoot-katrina-kaif-latest-hot-poses/