నవగ్రహాలకు ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలో తెలుసా?

ఆలయంలోని మూల విరాట్‌ను దర్శించుకున్నాకే :

 

నవగ్రహాలకు ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలో తెలుసా

నవగ్రహాలకు ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలో తెలుసా


నవగ్రహాలను ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలని తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. నవగ్రహాలను తొమ్మిదిసార్లు చుట్టి.. ఆపై ఒక్కో గ్రహానికి ప్రత్యేకించి ప్రదక్షణలు చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహాలను ప్రదక్షణలు చేయడం మంచిదే అయినప్పటికీ.. గుడికి వెళ్లి నేరుగా నవగ్రహాల వరకే చుట్టడం మాత్రం మంచిది కాదు.

ఏదైనా గుడికి వెళితే.. ఆలయంలోని మూల విరాట్‌ను దర్శించుకున్నాకే నవగ్రహాలను ప్రదక్షించడం చేయాలి. కేవలం నవగ్రహాల వరకే ప్రదక్షణలు చేసే విధానం సరికాదు. నవగ్రహాలకు సూర్యుడు నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఇరు చేతుల్లో తామర పూవులను ధరించి, కుడివైపు ఉష, ఎడమ వైపు ప్రత్యూష అనే ఇరు భార్యలతో.. ఏడు అశ్వాల రథంపై సూర్యనారాయణుడు భక్తులకు అనుగ్రహిస్తాడు. అందుకే నవగ్రహాల్లో తొలి నమస్కారం సూర్యదేవునికే వుండాలి. నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షణలు శ్రేష్ఠం. అయితే ఈ తొమ్మిది చుట్లు పూర్తయ్యాక.. ఒక్కో గ్రహం నుంచి ప్రత్యేక అనుగ్రహం కోరుకున్నట్లైతే..

సూర్యుడిని – 10 సార్లు
శుక్రుడు – 6 సార్లు
చంద్రుడు -11 సార్లు
శని – 8 సార్లు
అంగారకుడు – 9 సార్లు
రాహు – 4 సార్లు
బుధుడు – 5, 12, 23 సార్లు
కేతు – 9 సార్లు
గురు – 3, 12, 21 సార్లు ప్రదక్షించాలి.

యోగాన్ని ప్రసాదించే నవగ్రహాలు
1. సూర్యుడు – ఆరోగ్యం
2. చంద్రుడు – కీర్తి
3. అంగారకుడు – సంపద
4. బుధుడు- జ్ఞానం
5. గురు – గౌరవ మర్యాదలు
6. శుక్రుడు – ఆకర్షణీయత
7. శనీశ్వరుడు – సుఖమయ జీవనం
8. రాహు – ధైర్యం
9. కేతు – వంశపారంపర్య ప్రతిష్టలు, గౌరవాన్ని ప్రసాదిస్తారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-another-b-town-actress-tollywood/

About the Author

Leave a Reply

*