నీరవ్ మోడీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి :

 

కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి

కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి

 

మొదట్లో 13వేల కోట్లుగా.. ఆ తర్వాత రూ.16 వేల కోట్లకు పైనే కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీకి సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టటం ఒక ఎత్తు అయితే..అతగాడికి ఇంత పెద్ద స్థాయిలో సాయం ఎలా అందింది? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ప్రముఖుల పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది? తక్కువకాలంలో అంతలా ఎదగటానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలు పలువురి మనసుల్ని దోచేస్తున్నాయి.


నీరవ్ కు సంబంధించిన సమాచార సేకరణ కోసం లోతుల్లోకి వెళ్లి తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన అంశం షాకింగ్ గా మారింది. దేశంలోనే అత్యంత సంపన్నుడు.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో బంధుత్వం ఉన్న వైనం బయటకు వచ్చింది.


నీరవ్ మోడీ సోదరుడు విశాల్ మోడీ.. అంబానీ మేనకోడలు ఇషిత భర్త. ఆమె పెళ్లిని ముకేశ్ అంబానీ దగ్గరుండి చేసినట్లుగా చెబుతారు. ముకేశ్ అంబానీ సిస్టర్ దీప్తి కుమార్తె ఇషిత. ఇక.. దీప్తి భర్త దత్తరాజ్ గోవాలో పెద్ద పారిశ్రామికవేత్త. మేనకోడలి పెళ్లిని అంబానీ చాలా గ్రాండ్ గా చేసినట్లు చెబుతారు.


పెళ్లి కార్యక్రమాల్ని తన ఇంట్లోనూ.. ట్రైడెంట్ హోటల్లోనూ చాలా గ్రాండ్ గా నిర్వహించారని చెబుతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీరవ్ మోడీ మాదిరే.. విశాల్ కూడా డైమండ్స్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన పలు బ్రాండ్లతో వ్యాపారం చేస్తున్నట్లు చెబుతారు. అంబానీతో దగ్గర చుట్టరికం ఉండటం కూడా.. నీరవ్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించటానికి వీలుందన్న మాట వినిపిస్తోంది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-sonali-raut-latest-gallery/

About the Author

Related Posts

Leave a Reply

*