నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నారా?

నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నారా?

 

నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నారా

నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నారా


ఆరోగ్యానికి మంచిదని నీళ్లు ఎక్కువగా తాగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. నీళ్లు తాగడం మంచిదే కానీ అతి మితిమీరకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా నీటిని అదేపనిగా తాగుతూ వుంటే.. కిడ్నీలకు పనెక్కువ పడుతుందని వైద్యులు చెప్తున్నారు.

అతిగా తాగే నీటి ద్వారా కిడ్నీలు వేగవంతంగా పనిచేయాల్సి వుంటుందని.. తద్వారా కిడ్నీలపై భారం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మహిళలు రోజు ఎనిమిది గ్లాసులు, పురుషులు 12 గ్లాసుల నీటిని తాగితే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.

అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే.. ఉల్లి, ఎరుపురంగు క్యాప్సికమ్‌ తీసుకోవాలి. ఇందులో పొటాషియం తక్కువగా ఉండటంవల్ల అవి మూత్రపిండాలకు మేలుచేస్తాయి. అలాగే ఉల్లిలోని క్రోమియం జీవక్రియకీ మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఉడికించీ లేదా వేడినీళ్లలో ఓసారి ముంచి ఆహారంలో చేర్చుకోవచ్చు.

అలాగే రోజుకో ఆపిల్ తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేయవచ్చు. ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా వుండే చేపలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటితో పాటు కిడ్నీల పనితీరుని పెంపొందింపచేసేందుకు గుమ్మడి గింజలు.. పుచ్చకాయ, ఎర్ర ద్రాక్ష, స్ట్రాబెర్రీలు కూడా బాగా సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-simbu-gives-clarity-love-affair/

About the Author

Leave a Reply

*