పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్‌కు ఛాన్స్ మిస్ !

ప్రత్యేక హోదా కోసం పోరు :

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమంగా జగన్ పుంజుకుంటున్నారని, మరోవైపు 2014లో అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేయడం, బీజేపీ దూరం కావడం వంటి అంశాలు టీడీపీకి మైనస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవిశ్వాసం అంశం ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు,

 

ప్రత్యేక హోదా కోసం పోరు

ప్రత్యేక హోదా కోసం పోరు


విభజన హామీలను తాము నెరవేర్చుతున్నామని బీజేపీ చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చనందునే ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నామని టీడీపీ చెబుతోంది. అయితే, ఇందుకు సంబంధించి బీజేపీ ఆధారాలు చూపిస్తే అవిశ్వాసంతో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని, కేంద్రం హామీలు నెరవేరలేదని తెలుగుదేశం నిరూపిస్తే బీజేపీకి ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుదెబ్బే అంటున్నారు.

 

 

జనసేన చేసే విమర్శలకు కూడా గట్టి జవాబు అవుతుందని భావిస్తున్నారు. ఇంకో విషయమేమంటే అవిశ్వాస తీర్మానం అనే ఆయుధాన్ని తెరపైకి తెచ్చింది పవన్ కళ్యాణే. ఇప్పుడు అదే ఆయుధంతో టీడీపీ ఆయనను కార్నర్ చేసే అవకాశం దక్కించుకుందని భావిస్తున్నారు. అయితే బీజేపీని కార్నర్ చేస్తేనే ఫలితం ఉంటుంది.

 

 

అవిశ్వాసం సందర్భంగా బీజేపీని ఇరుకునపెడితే అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీని, ఇటు ఏపీలో వైసీపీ, జనసేనల నోరు మూయించవచ్చునని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై వైసీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. జగన్ యువభేరీలు కూడా నిర్వహించారు. ఎంపీలు ఇటీవల రాజీనామా చేశారు. గత సమావేశాల్లో వైసీపీ కూడా అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల లోకసభలో ఏపీ సమస్యలు విన్నవించుకునే మంచి ఛాన్స్‌ను వైసీపీ కోల్పోయింది.

ప్రత్యేక హోదా కోసం ఇలా పోరు చేస్తుండటం టీడీపీకి ప్లస్ కాగా, బీజేపీకి మరింత దెబ్బ. ఏపీ విషయాన్ని పక్కన పెడితే దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అవుతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే టీడీపీ అడగకున్నా మద్దతివ్వాల్సిన పరిస్థితి. అండగా నిలబడినా.. చట్టంలో అన్ని అంశాలను పేర్కొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీని నిలదీసే అవకాశముంది. మద్దతివ్వకుంటే కాంగ్రెస్‌కు మరింత నష్టం. కానీ కాంగ్రెస్ మద్దతిస్తుంది.

 

Read Also : http://www.legandarywood.com/photo-shoot-rhea-chakraborty-latest-pics/

About the Author

Related Posts

Leave a Reply

*