పిక్ టాక్ : గాలి నాగేశ్వరరావు మస్త్ రొమాంటిక్ గురూ..!

మంచు విష్ణు ఈమద్య కాలంలో సన్నీ లియోన్.. పాయల్ రాజ్పూత్ తో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో తో కూడా ఇంత క్లోజ్ గా సన్నీ లియోన్ ఉన్నదే లేదు. గతంలో మంచు మనోజ్ తో కలిసి నటించినా కూడా ఇప్పుడు మంచు విష్ణు తో నటిస్తున్న సమయంలోనే సన్నీ లియోన్ షూటింగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది.

మంచు విష్ణు ఈ సినిమా లో గాలి నాగేశ్వరరావు అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఎక్కువగా చిత్తూరు.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే గాలి నాగేశ్వరరావు సినిమా చాలా ఫేమస్ అయ్యింది. ఇన్ని రోజులుగా మంచు విష్ణు మరియు ఇతర యూనిట్ సభ్యులు షేర్ చేసిన ఫోటోలతో సినిమా గురించి చర్చ జరిగింది.

పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు అవ్వడంతో టైటిల్ అదే అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను ఎక్కువగా చేయనక్కర్లేకుండా మంచు మనోజ్ మరియు ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సినిమాకు మస్త్ ప్రమోషన్ ను తెచ్చి పెడుతున్నాయి.

తాజాగా మరో ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో మంచు విష్ణు సన్నీ కి ముద్దు పెడుతున్నట్లుగా ఉండగా పాయల్ రాజ్ పూత్ ఆ ఫోజ్ ను క్లిక్ చేసింది. సెల్ఫీ లో పాయల్ ను కూడా చూడవచ్చు. గాలి నాగేశ్వరరావు పాత్ర చేస్తున్న కారణంగానో లేదా మరేంటో కాని మంచు విష్ణు మస్త్ రొమాంటిక్ అయ్యాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

మరో వైపు సినిమా ను జాగ్రత్తగా తీయాలని.. లేదంటే మోసగాళ్లు మరియు సన్నాఫ్ ఇండియా పరిస్థితి అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ హెచ్చరిస్తున్నారు. మంచు ఫ్యామిలీకి ఇప్పటికిప్పుడు వెంటనే ఒక సాలిడ్ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ ను గాలి నాగేశ్వరరావు ఇస్తాడేమో చూడాలి. సన్నీ లియోన్ ను కేవలం 20 రోజుల డేట్లు అంటూ సినిమాకు ఒప్పించి అంతకు మించిన రోజులు ఆమెతో షూటింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి.

ఆమె కూడా పాత్ర నచ్చడంతో ఎన్ని డేట్లు అడిగితే అన్ని ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. గాలి నాగేశ్వరరావు సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్.. ఫస్ట్ లుక్ మరియు విడుదల తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

About the Author

Leave a Reply

*