పులిని చంపిన రైతు నేరస్థుడా?

పులిని చంపిన నేరం కోణంలో :

 

పులిని చంపిన నేరం కోణంలో

పులిని చంపిన నేరం కోణంలో

చేతిలో పిస్తోలు లేదు. కానీ.. గుండెల్లో దమ్ము ఉంది. దాన్నే పెట్టుబడిగా పెట్టి తన ప్రాణాలు తీయాలనుకున్న చిరుత పులిని చంపేశాడు ఒక రైతు. కర్ణాటకలోని కృష్ణగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మగరాజు కట్ట గ్రామంలో చోటు చేసుకున్న వైనం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.


ఫార్మ్ హౌస్ లో పాలు పితికేందుకు వెళుతున్న రామమూర్తి అనే రైతుకు పులి కనిపించింది. ప్రమాదాన్ని శంకించిన అతగాడు.. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. అప్పటికే తన వైపునకు దూసుకొస్తున్న పులిని తన దగ్గరున్న వేట కత్తితో ఒడుపుగా దించేశాడు. దీంతో.. అది కింద పడింది. దాంతో.. ఆ పులిని చంపేశాడు.


పులిని చంపిన అతడి ధైర్యసాహసాలకు ఆ ఊళ్లో వారంతా అతన్ని పొగిడేస్తున్నారు. అయితే.. రామమూర్తి మాత్రం భయంతో వణికిపోతున్నారు. పులిని చంపిన నేరానికి అటవీ సంరక్షణ శాఖ అధికారులు తనపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని భయపడుతున్నాడు.


ఒక రైతు పులిని చంపారన్న విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష చేసి పులిని పూడ్చి పెట్టారు. పులిని చంపిన రైతుపై కేసు పెట్టాలా? వద్దా? అన్న విషయంపై మాత్రం అధికారులు నిర్ణయం తీసుకోలేదు.


ఇదిలా ఉంటే..పులిని చంపిన రైతు నేరస్థుడా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ప్రాణభయంతో తనను తాను కాపాడేందుకు ప్రయత్నించాడే తప్పించి.. పులిని చంపాలని చంపలేదు. ఈ నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకునేఅవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. పులిని చంపిన నేరం కోణంలో చూస్తే తప్పుగా అనిపించినా.. అతడు చంపింది తన ప్రాణరక్షణ కోసం కావటంతో అతడు చట్టప్రకారం ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాన్ని న్యాయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

 

Read Also : http://www.legandarywood.com/gossip-mahanati-anushka-legendary-actress/

About the Author

Leave a Reply

*