నా అందాల రాజు కోసం ఎదురుచూస్తున్నా.. తప్పేం కాదుగా.. పెళ్లిపై కరాటే కళ్యాణి పోస్ట్

ప్రేమ-పెళ్లి.. వీటిపై ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. ప్రేమ అనేది మధురకావ్యం అనే వాళ్లు కొందరైతే.. అదో ముళ్లు బాట అనేవాళ్లు ఉన్నారు.

ఎప్పుడూ ఏదోఒక వివాదంతో వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి.. ఇటీవల యూట్యూబర్‌ని చెంపదెబ్బలు కొట్టి.. అతనితో తిరిగి కొట్టించుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఒకరిపై ఒకరు కేసులుపెట్టుకోవడంతో కరాటే కళ్యాణి వివాదాల్లో నిలిచింది. ఇక ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కరాటే కళ్యాణి.. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఫేస్ బుక్‌లో పోస్ట్‌లు పెడుతూ వేరే వాళ్లిని తిడుతూ.. తాను తిట్టించుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకునే కరాటే కళ్యాణ్.. ప్రేమ, పెళ్లిపై తన సొంత అనుభవాలను పంచుకుంది. మగాళ్లంతా మోసగాళ్లేనంటూ.. ప్రేమ పేరుతో మోసపోయే కంటే సోలోగా బ్రతకడమే బెస్ట్ అంటూ పోస్ట్ పెట్టింది.

‘‘నీ అంత మంచి మనిషి లేదు.. నువ్వు తోపు తురుము అని నీతో జీవితాంతం ఉంటా.. లేదంటే చచ్చిపోతా అని నిన్ను ముగ్గులోకి దించేదీ వాడే.. మోజు తీరాక అంటే కొంతకాలం లవ్ ట్రాక్ నడిపిన తరువాత నీ డామినేషన్ ఏంటి? మూసుకొని కూర్చో.. లేదా వేరే పెళ్లి
చేసుకుంటా.. ఎక్కువ మాట్లాడకు అంటాడు. అప్పటికీ నువ్వు వాడి మత్తులో ఉంటావ్.. పిచ్చిదానిలా.. నువ్వు చెప్పింది చేస్తా నాన్న కన్నా నన్ను వదలకు అని ప్రాధేయపడి వాడికి సొమ్ములు ఇస్తావ్.. అడుగులకు మడుగులు ఒడ్డి.. అతనితోనే ఉంటావ్..

ఇక అప్పటి నుంచి మొదలు సారు ప్రతాపం.. ఏంటి? ఆ బట్టలు? ఆ జుట్టు అలా ఉంది ఏంటి? ఇంతసేపు ఎక్కడకి వెళ్లావ్.. వాడెవడు నీతో మాట్లాడుతున్నాడు? అందరితోనూ మాటలా? మీ తమ్ముళ్లు… మీ అమ్మ నాన్న ఎవ్వరూ రాకూడదు. సినిమా నేను తీసుకెళ్తే రావాలి.. పిల్లలు పుట్టాక పని మానేయాలి..ఇలా ఒకటా రెండా .. అనుమానం ముందు పుట్టి వీడు వెనుక పుట్టాడా? అన్నట్టుగా.. ఇలా చిత్ర హింసలు చేసి చివరికి కొన్ని సంవత్సరాలు భరించి ఓపిక అయిపోతే వదిలి వచ్చేస్తారు. మీరు మోసం చేసి.. ఆడవాళ్ళు మోసం చేశారని అంటారు.
తాగి వచ్చి కొడతారు.. ఒకటా రెండా.. డబ్బులు కావాలి అంటే మాత్రం మామూలుగా ఉండదు. కొందరికి అందం దేవుడు ఇచ్చిన వరం.. అదే శాపం కూడా అవుతుంది కొంతమందికి ఏమిచేస్తాం. ఇలా మనం ప్రేమ దోమా అనగానే పడిపోతే ఇలాగే ఉంటుంది. వీళ్ళని ఎక్కడ త…న్నా..లో మరి.

మనసుతో ఆదుకొనే ***తో ఉండేకన్నా సోలోగా బ్రతకడం బెస్ట్. నాకు తెలిసీ ఇందులో నాకు జరిగినవి ఉన్నాయి. ప్రతి అమ్మాయికి
జరుగుతాయి. కానీ మేము మనుషులం ఎప్పటికీ అర్థం అవుతుంది. నాన్న ప్రేమ తప్పా ఇంకేది శాశ్వతంగా ఉండదు. మగాళ్లు వట్టి మాయగాళ్లు.. ఇదే నిజం.. నిజంగా మంచిభర్త దొరికితే అదృష్టం అంటారు. నాకు ఈ జన్మకి అదిలేదు. అనుకొని బ్రతికే నన్ను కెలికింది నా స్నేహితురాలు. ఒసేయ్ మీ ఆయన కూడా దొంగ కాబట్టి అవకాశం రానంత వరకు అమాయకులు.. వస్తే చూపిస్తారు తడాఖా. ఇంకొందరు అయితే .. నాదే తప్పా.. నువ్వు ఆనందించావు కదా అనేవాళ్ళు ఉంటారు వెర్రిదనా.. రాస్తే మీ మా ఇంటి కథలు పెద్ద పుస్తకం రాయొచ్చు గానీ.. మంచి వాళ్ళు ఇంకా మంచివారుగా మారండి.. మీ భార్యల కష్టం కాస్త చూడండి.

మూడో వాడు ఏమనుకుంటారో అని ఆలోచన వస్తే విడిపోతారు. ఇదే నిజం.. వచ్చే జన్మ ఉంటే ఆ జన్మలో నాకు నా అందాల రా రాజు రావాలని ఎదురు చూస్తా.. తప్పుకాదుగా.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకో అనకండి.. వచ్చేవాడికి ఇలాంటి పోరాటాలు నచ్చవు. ఒకవేళ నచ్చేవాడు వస్తే మనవాళ్ళు నువ్వు చేసుకోకూడదు అని అనేస్తారు త్రోలింగ్‌లో. నేను మంచి గయ్యాళిని కదా ప్రపంచంలో ఎవ్వరికీ నచ్చను. ఈరోజు బాగా బాధ పెట్టిన నా స్నేహితురాలుకి గట్టిగాక్లాస్ పీకాను. కోపం వస్తుంది బాధా అన్ని కలిపి ఈపోస్ట్ పెట్టాను. తప్పుగా ఎవరికైనా అనిపిస్తే నేను బాధ్యురాలిని కాదు.. ప్రేమ గీమ ఇలాంటి తొక్కలో కమిట్మెంట్ పెట్టుకోవద్దు.. అర్థమైందా పిల్లా.. ఇది నీకే.. ఇక ఉంటా’ అంటూ పోస్ట్ పెట్టింది కరాటే కళ్యాణి.

అయితే కరాటే కళ్యాణికి ఇప్పటికే రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రేమ, పెళ్లి తనకు కలిసి రాలేదని.. వాటి పేరుతో తనను వాడుకున్నారు తప్పితే నిజమైన ప్రేమ లభించలేదని అంటుంటారు కళ్యాణి. తల్లి కావాలని బిడ్డను ఎత్తుకోవాలని తన ఆశతో రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ ఆశ తీరలేదని.. పిల్లల్ని కనాలనే ఆశ అయితే తనకి ఉందని అంటోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అయితే.. మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో.. లేదంటే సహజీవనం చేసి అయినా పిల్లల్ని కంటానేమో అని అన్నది. తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. మొదట్లో పిల్లల్ని కనేందుకు కొన్ని సమస్యలు వచ్చినా.. తరువాత అలాంటివి రాలేదని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని.. అన్ని టెస్ట్‌లు చేయించుకున్నానని తెలిపింది కరాటే కళ్యాణి.

About the Author

Leave a Reply

*