ప్రెండ్స్ తో డేట్ నైట్..సమంత సూపర్ హాట్!

సమంతకి సమయం దొరికితే ప్రీబర్డ్ లా ఎగిరిపోతుంది. రెక్కలున్న పక్షిలా ప్రపంచం చుట్టేయాలని చూస్తుంది. ప్రియమైన  ప్రెండ్స్ తో కలిసి షికార్లు చెక్కేస్తుంది. ఇండియాలోనే చూడాల్సిన  బోలెడన్ని అందాలున్నాయి ఆస్వాదిద్దాం పదండి అంటుంది. విదేశీ వెకేషన్ కన్నా వీలైనంత ఇండియాలోనే ఎక్కువగా తిరగడానికి ఇష్టపడుతుంది. ఆ మూవ్ మెంట్స్ ని ఇన్ స్టా వేదికగా అభిమానులకు షేర్ చేసి వాళ్లని సైతం చిల్ చేస్తుంది.

తాజాగా సమంత స్నేహితులతో కలిసి డేట్ నైట్ ని ఎంజాయ్ చేసింది. సామ్ కి ఇష్టమైన స్నేహితులు మేకప్ ఆర్టిస్ట్ సాధానాసింగ్- హెయిర్ స్టైలిష్ ప్రీతమ్ జవాల్కర్ తో కలిసి డైట్ నైట్ పార్టీని ఎంజాయ్ చేసింది. ‘యశోద’ షూటింగ్ ముంగిచిన సామ్ అనంతరం ఇలా డేట్ నైట్ పార్టీలో మునిగిపోయింది. ముందుగా ముగ్గురు కారులో కలిసి ఓ సెల్పీ దిగారు.

అనంతరం వీధులన్నింటిని కారులో చుట్టేసారు. అటుపై రెస్టారెంట్ లో మరోఫోటోని  కవర్ చేసారు. ఇందులో సమంత రెడ్ హాట్ మంటలు రేపుతుంది. క్యూట్ స్మైల్…షైనింగ్ బాడీ లుక్ లో సామ్ యువతని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

రెడ్ హాట్ పై  సమంత అభిమానుల కామెంట్లు ఆసక్తికరం. సామ్ సింగిల్ గా ఓ ఫోజు ఇస్తే ఇంకా బాగుండేది? అంటూ ఓ అభిమాని కామెంట్  పెట్టగా..యశోద సెట్ నుంచే సామ్ షికార్ కి ఎగిరిపోయిందా? అంటూ మరో ఫ్యాన్ కామెంట్ పోస్ట్ చేసాడు.

ఇక సమంత నటిస్తోన్న రెండు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు ‘శాకుంతలం’..’యశోద’పై  ఎంతో కాన్పిడెంట్ గా ఉంది. రెండు చిత్రాలు వేటికవి  ప్రత్యేకతని  కలిగి ఉన్నాయి. ‘శాకుంతలం’ డిఫరెంట్ జానర్ సినిమా కాగా…’యశోద’ హారర్ థ్రిల్లర్. ఇలా ఒకేసారి రెండు డిఫరెంట్ జానర్ చిత్రాలు చేయడం సామ్ కి ఇదే తొలిసారి.

తనని పరిపూర్ణ నటిగా ఆవిష్కరించడానికి స్కోప్ ఉన్న చిత్రాలివి. ఇప్పటికే ‘ఓ బేబి’..’యూ టర్న్’ లాంటి చిత్రాలు సమంతలో మరో ప్రతిభని వెలికితీసాయి. ఆ కాన్పిడెన్స్ ..సమంత స్టార్ డమ్ నేపథ్యంలోనే వెంట వెంటనే రెండు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. మరోవైపు బాలీవుడ్ పైనా సీరియస్ గా దృష్టి పెట్టింది . సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ ఛాన్సులు అందుకుంటుంది. తుదిగా ముంబైలోనే  స్థిరపడాలన్న ఉద్దేశంతో అక్కడే స్తిరాస్తులు ఏర్పాటు చేసుకుంటుంది. ఇటీవలే మకాం  హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చినట్లు వెలుగులోకి వచ్చింది.

About the Author

Leave a Reply

*