బతికుండగానే డ్రైనేజీలో పూడ్చేశారు.. తమిళనాడులో ఘోరం

తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. బతికుండగానే ఓ వ్యక్తిని పూడ్చేశారు. అయితే కావాలని పూడ్చలేదు. కూలీలు పొరపాటున అలా చేసేశారు. తర్వాత పూడ్చేసిన వ్యక్తిని తీసే క్రమంలో అతను అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.

మధురైలోని వికలాంగుడి సమీపంలోని రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది. చాలా మంది కూలీలు ఆ పనికి వచ్చారు. పనిలో భాగంగా సతీష్ అనే కార్మికుడు 11 అడుగుల లోతున్న డ్రైనేజీ గుంతలోకి దిగాడు. అయితే లోపల పనిచేస్తున్న సతీష్ ను గమనించకుండానే పైన ఉన్న కూలీలు.. డ్రైనేజీ పైపులపై మట్టి పోశారు. పూర్తిగా కప్పేశారు. దీంతో గుంతలోనే మట్టిలో కూరుకుపోయాడు కార్మికుడు సతీష్. కొంత సేపటి తర్వాత సతీష్ గుంత లోపలే ఉన్నాడని గ్రహించిన కూలీలు కలవరపడ్డారు. సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కప్పేసి మట్టిని తీసే ప్రయత్నం చేశారు.

అయితే జేసీబీ మట్టి తీస్తుండగా దాని హ్యాండ్ లోపల ఉన్నా కార్మికులు సతీష్ ను తాకింది. జేసీబీ హ్యాండ్ తలను బలంగా తాకడంతో.. సతీష్ తల తెగిపోయింది. దీంతో స్పాట్ లోనే సతీష్ చనిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనతో కూలీలంచా షాకయ్యారు. తమ సహచరుడిని చంపేసుకున్నామని కన్నీళ్లు కార్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వర్క్ ఇంజినీర్ సికందర్, పర్యవేక్షకుడు బాలుతో పాటు జేసీబీ ఆపరేటర్ సురేశ్ ను అరెస్ట్ చేశారు.కార్మికుడు చనిపోయిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

About the Author

Leave a Reply

*