బీజేపీతో విసిగిపోయారు @ కేజ్రీవాల్
నాటికి బీజేపీ బాగా బలహీనపడుతుందని :

నాటికి బీజేపీ బాగా బలహీనపడుతుందని
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 215 స్థానాలకు మించి గెలవలేదని ఢిల్లీ ముఖమంత్రి – ఆమ్ ఆద్ మి పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన దానికి గల కారణాలను కూడా రాసుకొచ్చారు. ‘‘కొద్ది రోజుల క్రీతం కొంత మంది కలిశారు. వారందరూ ఏకాభిప్రాయంతో చెప్పారు. 2019 ఎన్నికల్లో 215 సీట్ల కంటే తక్కువే బీజేపీ గెలుస్తుంది. నిరుద్యోగిత అనేది పెద్ద సమస్య. యువత వారి భవిష్యత్ పట్ల తీవ్ర నిరాశతో ఉన్నారు. మధ్య తరగతి వారు కూడా బీజేపీతో విసిగిపోయారు’’ అని రాసుకొచ్చారు.
కాగా చాలాకాలంగా సైలెంటుగా ఉన్న కేజ్రీవాల్ మళ్లీ బీజేపీపై దాడి మొదలుపెట్టడానికి కారణం టీడీపీ శివసేన వంటి పార్టీలు బీజేపీకి దూరం కావడం వల్లేనని తెలుస్తోంది. ఇంతకాలం చాలా బలంగా ఉన్న బీజేపీ మొన్నటి బడ్జెట్ తరువాత మిత్రపక్షాలను కూడా దూరం చేసుకునే పరిస్థితిని తెచ్చుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బాగా బలహీనపడుతుందని కేజ్రీ భావిస్తున్నారని.. ఆ క్రమంలోనే మళ్లీ ఆయన బీజేపీపై వ్యూహాత్మక దాడిని పున:ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
Latest trailer : http://www.legandarywood.com/trailer-talk-jurassic-park-mind-blowing/