బీజేపీని వదిలించుకున్న పార్టీలు ..

బీజేపీని వదిలించుకున్న పార్టీలు :

 

బీజేపీని వదిలించుకున్న పార్టీలు

బీజేపీని వదిలించుకున్న పార్టీలు

బీజేపీ ఎన్డీయేలోని కొన్ని పార్టీలను ఎలా మింగేసింది.. అలాగే పలు పార్టీలు బీజేపీని ఎలా వదిలించుకున్నాయి.. అందుకు దారి తీసిన పరిస్థితులు – సందర్భాలు ఏంటన్నది చూద్దాం. బీజేపీని విడిచిపెట్టిన పార్టీల్లో చాలావరకు ఆయా రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పనిచేశాయి. దీంతో టీడీపీ కూడా ఎన్నికలు వచ్చేనాటికి బీజేపీని వదిలేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

* అన్నాడీఎంకే.. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని ఈ పార్టీ గతంలో ఎన్డీయేలో ఉన్నప్పటికీ 1999 ఎన్నికల సమయంలో పొత్తు తెంచుకుని కాంగ్రెస్ పక్షాన చేరింది.


* లోక్ శక్తి… బీహార్లోని ఈ పార్టీ 1999 ఎన్నికల సమయంలో జేడీ(యూ)లో కలిసిపోయింది. 1990ల్లో జనతాదళ్ చీలినప్పుడు రామకృష్ణ హెగ్డే ఈ పార్టీని ఏర్పాటుచేశారు. కర్ణాటకలో కొద్దికాలం ప్రభావవంతంగా ఉంది. ఎన్డీయే వ్యవస్థాపక పార్టీల్లో ఇది కూడా ఒకటి.


* నేషనల్ కాన్ఫరెన్స్.. ఫరూక్ అబ్దుల్లాకు చెందిన ఈ పార్టీ 2002లో జమ్ముకశ్మీర్ లో ఓటమి పాలైనప్పుడు ఎన్డీయే నుంచి బయటకొచ్చేసింది. బీజేపీ కారణంగానే ఓడిపోయామంటూ పొత్తు తెంచుకుంది.


* సమతా పార్టీ… జార్జిఫెర్నాండెజ్ నేతృత్వంలోని ఈ పార్టీ 2003లో జేడీయూతో కలిసిపోయింది.


*డీఎంకే.. 1999లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకొచ్చేశాక డీఎంకే అందులో చేరింది. కానీ.. 2004 ఎన్నికలప్పుడు ఆ పార్టీకూడా ఎన్డీయే నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కలిసింది.


* హర్యాణా వికాస్ పార్టీ.. 2004 ఎన్నికలప్పుడు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తో కలిసింది.


* ఇండియన్ ఫెడరల్ డెమొక్రటిక్ పార్టీ.. కేరళకు చెందిన ఈ పార్టీ 2004 ఎన్నికలప్పుడు కేరళ కాంగ్రెస్ లో కలిసిపోయింది.


* తృణమూల్ కాంగ్రెస్.. 2007లో బీజేపీతో పొత్తును తెంచుకుంది.


* ఇండయన్ నేషనల్ లోక్ దళ్.. హరియాణాకు చెందిన ఈ పార్టీ 2009లో అక్కడి అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీట్ల సర్దుబాట్లు కుదరక బీజేపీని వదిలేసింది.

* బిజూ జనతాదళ్.. 2009ఎన్నికలకు నెల రోజుల ముందు బీజేపీని వదిలేసింది. కొంధమాల్ లో లక్ష్మణానంద సరస్వతి హత్య తరువాత జరిగిన అల్లర్లనేపథ్యంలో బీజేడీ బీజేపీని వదిలించుకుంది. అది మొదలు ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో మరింత బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం ఒడిశాను ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.


* టీఆరెస్… 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీని వదిలేసింది.


* జేడీ(ఎస్).. కర్ణాటకలో దేవగౌడకు చెందిన ఈ పార్టీ 2010లో ఎన్డీయేను వదిలేసింది.


* లదాఖ్ యూనియన్ టెరిటరీ ఫ్రంట్… జమ్ముకశ్మీర్లోని ఈ పార్టీ ని బీజేపీ 2010లో తనలో కలిపేసుకుంది.


*కామ్తాపూర్ ప్రొగ్రెసివ్ పార్టీ… వెస్టుబెంగాల్లోని ఈ పార్టీ 2010లో కామ్తాపూర్ పీపుల్స్ పార్టీలో కలిసిపోయింది. దీంతో ఎన్డీయే నుంచి వైదొలగింది.


* ఉత్తరాఖండ్ క్రాంతిదళ్.. 2012లో ఆ రాష్ట్ర ఎన్నికలప్పుడు బీజేపీతో పొత్తు తెంచుకుంది.


* రాష్ర్టీయ లోక్ దళ్.. ఉత్తరప్రదేశ్ లో అజిత్ సింగ్ కు చెందిన ఈ పార్టీ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ తో కలిసింది.


* జార్ఖండ్ ముక్తి మోర్చా.. శిబూసోరేన్ కు చెందిన ఈ పార్టీ 2012లో కమలానికి దూరమైంది.


*జనతా పార్టీ.. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఈపార్టీ బీజేపీలో కలిసిపోయింది.


* హర్యాణా జనహిత కాంగ్రెస్.. 2014లో హరియాణా ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వైదొలగింది.


*ఎండీఎంకే… 2016 తమిళనాడు ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమైంది.


* కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్(నోబుల్ మాథ్యూ వర్గం).. 2016లో ఈ పార్టీని బీజేపీ తనలో కలిపేసుకుంది.


* డీఎండీకే.. హీరో విజయ్ కాంత్ స్థాపించిన ఈ పార్టీ 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు తెంచుకుంది.


*కేరళ జనపక్షం.. 2016లో బీజేపీలో కలిసిపోయింది.


* రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ కేరళ.. 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు వదులుకుంది.


*మారాలాండ్ డెమొక్రటిక్ ఫ్రంట్.. మిజోరాంలోని ఈ పక్షం 2017లో బీజేపీలో కలిసిపోయింది.


*స్వాభిమాన్ పక్ష్.. ఎంపీ రాజు శెట్టి నేతృత్వంలోని ఈ పార్టీ మహారాష్ర్టకు చెందిన ఈ పార్టీ 2017లో బీజేపీతో బంధం తెంచుకుంది.

 

Read Also : http://www.legandarywood.com/gossip-mahanati-anushka-legendary-actress/

About the Author

Related Posts

Leave a Reply

*