బీజేపీ నేతలు కుక్కిన పేనులా …

రాయితీలు ఎందుకు ఇవ్వరు? 

 

బీజేపీ నేతలు కుక్కిన పేనులా

బీజేపీ నేతలు కుక్కిన పేనులా


సెంటిమెంట్‌తో నిధులు రావని కేంద్ర విత్తమంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఏం… తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ఆయన నినందించారు. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగాం. కేంద్రంలో పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదని స్పష్టం చేశారు.


హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టం చేశారు. కేంద్రం చట్టాన్ని గౌరవించాలి. హామీలను నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అహేతుకంగా విభజించారు కాబట్టి… హోదా అనేది ఒక హక్కు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయడం సరికాదనీ, కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలే చెబుతోందని మండిపడ్డారు.


కాగా, ఇటీవలే తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలో కేంద్రంపై విమర్శల దాడికి దిగిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఇచ్చామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనపై ఆయన విలేకరుల సమావేశంపెట్టిమరీ కేంద్రం తీరును తూర్పారబట్టారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో ఇచ్చే మొత్తంలో కనీసం 50 శాతం కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదంటూ పూర్తి గణాంకాలను వివరించారు. దీంతో బీజేపీ నేతలు కుక్కిన పేనులా నోరెత్తకుండా మిన్నకుండిపోయారు. మొత్తంమీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ దక్షిణాది సెంటమెంట్‌ను తెరపైకి తీసుకరావడం ఇపుడు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.

 

Read Also : http://www.legandarywood.com/sketch-latest-telugu-movie-vikram-tamannah-2/

About the Author

Related Posts

Leave a Reply

*