భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?

జీవజాతులకూ, పంట చేలకు కూడా ప్రమాదమే :

భారత దేశం విషయానికొస్తే, వ్యవసాయ భూముల్లో పంట కోతలు పూర్తయ్యాక వ్యర్థాలను తగలబెట్టడం కూడా మరో కారణంగా చెప్పొచ్చని బెల్జియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ ఏరోనమీ సంస్థకు చెందిన పరిశోధకురాలు ఇసాబెల్లె అన్నారు.

అస్థిర కర్బన సమ్మేళనాలు, నైట్రోజన్ డయాక్సైడ్ (ఇంధనం మండించడం ద్వారా వెలువడే NO₂), సూర్యరశ్మితో కలిసి చర్యనొందినప్పుడు భూతలానికి సమీపంలో ఓజోన్ (ట్రోపోస్పియరిక్ ఓజోన్) ఏర్పుడుతుంది. అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దానితో ఇతర జీవజాతులకూ, పంట చేలకు కూడా ప్రమాదమే,

 

జీవజాతులకూ, పంట చేలకు కూడా ప్రమాదమే

జీవజాతులకూ, పంట చేలకు కూడా ప్రమాదమే

 

ఫార్మాల్డిహైడ్ వాయువు సహజంగా మొక్కలు, జంతువుల నుంచి విడుదలవుతుంది. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే యంత్రాలు, కర్మాగారాల నుంచి కూడా వెలువడుతుంది.

ఉపగ్రహం ద్వారా సేకరించిన పై చిత్రాన్ని చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం వాతావరణంలో ఫార్మాల్డిహైడ్(CH₂O) అనే వర్ణరహిత వాయువు పరిమాణాన్ని సూచిస్తోంది.

ఉత్తర భారతంలోని మైదాన ప్రాంతాల నుంచి కాలుష్య కారక వాయువులు ఉత్తరం దిశగా వెళ్లకుండా హిమాలయ పర్వాతాలు ఎలా అడ్డుపడుతున్నాయో కూడా పై ఉపగ్రహ చిత్రంలో చూడొచ్చు.

సాధారణంగా వాతావరణంలో అధికంగా ఉండే నైట్రోజన్, ఆక్సీజన్‌ వాయువులతో పోల్చితే ఫార్మాల్డిహైడ్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా గాలి నాణ్యతను అంచనా పరిశీలించేందుకు ‘సెంటినల్-5పీ’ అనే ఉపగ్రహాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2017 అక్టోబర్‌లో అంతరిక్షంలోకి పంపింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల మీద కమ్మేసిన CH₂O గాఢతను ఆ ఉపగ్రహం గుర్తించింది.

విభిన్న రకాల అస్థిర కర్బన సమ్మేళనాలతో ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది. అది సజహంగా మొక్కలు, జంతువుల నుంచి విడుదల అవుతుంది.

అలాగే, మంట పెట్టినప్పుడు, కాలుష్యాన్ని విడుదల చేసే యంత్రాల నుంచి కూడా ఫార్మాల్డిహైడ్ వెలువడుతుంది. అందుకే వాతావరణంలో దాని పరిమాణం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది.

బొగ్గును మండించే కర్మాగారాలు, అడవుల్లో కార్చిచ్చు వల్ల ఇది ఎక్కువగా విడుదలవుతుంది.

రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్ తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. అందుకు కారణం ఏమిటో కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఎడారుల్లో చెట్లు తక్కువగా ఉంటాయి, జనసాంద్రత కూడా తక్కువే.

తాజా మ్యాప్‌లో 4 నెలల పాటు సేకరించిన సమాచారం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

Read Also : http://www.legandarywood.com/sri-lankan-beauty-gearing/

About the Author

Related Posts

Leave a Reply

*