భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు…

పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా?

 

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు


భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా వున్నారా? ఎప్పుడూ పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా? అయితే హనుమంతుడిని ఇలా పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఏం చేయాలంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.


ఇలా ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేసినట్లైతే.. సుఖమయ జీవితం చేకూరుతుంది. స్త్రీలు 41 రోజుల పాటు హనుమంతుడిని పూజించినట్లైతే.. మధ్యలో విరామం ఇచ్చి తిరిగి 41 రోజులు ఈ పూజను పూర్తి చేయవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.


అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానివారు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి.. దానితో దీపారాధన చేయాలని.. అలాగే బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. దృష్టి లోపాలు, శత్రు విజయం కోసం పొట్టుతీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. శని దోషాలు తొలగిపోవాలంటే.. నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

 

Read Also : http://www.legandarywood.com/photo-story-modys-time-fake-followers/

About the Author

Related Posts

Leave a Reply

*