మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో భారీగా చమురు నిక్షేపాలు !
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీగా చమురు నిక్షేపాలు :
పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలోని అశోక్ నగర్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను గుర్తించామని వెల్లడించారు. గుజరాత్‌లోని కచ్‌లో ఎనిమిదవ చమురు బేసిన్‌ను గుర్తించామని పేర్కొన్నారు,

మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీగా చమురు నిక్షేపాలు
మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీగా చమురు, సహజవాయు నిక్షేపాలను ఒఎన్‌జిసి కనుగొంది. ఈ నిక్షేపాలు దేశ అవసరాలను తీర్చడంలో ప్రధాన భూమికను పోషిస్తాయని ఒఎన్‌జిసి డైరెక్టర్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఒఎన్‌జిసి గతంలో ప్రారంభించిన ఏడు చమురు క్షేత్రాల్లో ఆరుంటిని వాణిజ్య ఉత్త్పతికి కేటాయించామని ఆయన తెలిపారు.
మరొక మూడు బేసిన్లను వచ్చే ఐదు ఏళ్లలో ఏర్పాటు చేస్తామని మరొక డైరెక్టర్ అజయ్ కుమార్ త్రివేది అన్నారు. మధ్యప్రదేశ్‌లోని వింధ్యాన్ బేసిన్‌లోని బ్లాక్‌లో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతానికి పరిశోధనలు చేస్తున్నామని అన్నారు, ఇది వచ్చే 2-3 సంవత్సరాలలో ఉత్పత్తి జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
Read Also : http://www.legandarywood.com/tollywood-handsome-new-look-going-viral/