మన పెరట్లో పూలకు ఆ’శక్తి’ ఉందా !
మన పెరట్లో పూలకు ఆ శక్తి ఉందా :
ఈ నవయుగంలో మనం మరచిపోయిన మన పెరటి వైద్యం గురుంచి తెలుసుకుందాం… మనం పెరట్లో పెంచే పువ్వులకు ఎన్నో ఓషధ గుణాలున్నాయి, ఆ పువ్వులేంటో, వాటి ఓషధ గుణాలేంటో ఓసారి లుక్కేద్దాం…

పెరట్లో పూలకు
రోజా పువ్వులు పేగురుగ్మతలు, లివర్ సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వవు, అలాగే రక్తాన్ని శుద్ధిపరచటంలోనూ రోజాపూలు మెరుగ్గా పని చేస్తాయి.

దిండుకింద ఉంచి
గోరింటాకు పూలను పడుకునేముందు దిండుకింద ఉంచి నిద్రిస్తే, హాయిగా నిద్రపోవచ్చు మరియు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు మరియు మల్లెపువ్వులు కంటివ్యాధులను నయంచేస్తాయి. మల్లెపూలు దాంపత్యసుఖాన్ని ఇస్తాయి.. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నోన్నో..

మానసిక ఒత్తిడి
తామర పూలను తాగేనీటిలో వేసి, బాగా మరిగించి తాగితే ఉదార సంబంధిత సమస్యలు తీరుతాయి, జ్ఞాపకశక్తికి ఇది ఎంతో మేలుచేస్తుంది. అలాగే తామర గింజలను రోజు అరస్పూన్ తీసుకుంటే రక్తంవృద్ధి చేకూరుతుంది.వేప పువ్వు పేగుల్ని శుభ్రపరుస్తుంది. నులిపురుగులను నశించేలా చేస్తుంది. ఇక మునగ గురుంచి చెప్పేదేముంది..ఇలా చెప్పుకుంటూ పొతే లెక్క సరిపోదని.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు..
Read Also : https://www.legandarywood.com