మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు !

మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు :

పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన బ్యాంకులను కలుపుతోందా? అన్న వదంతులు స్టాక్‌ మార్కెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. అలహాబాద్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌తో పాటు యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను విలీనం చేస్తారని స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఈ మూడు బ్యాంకులపై ఇప్పటికే ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది,

 

మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

 

రుణాల జారీతో పాటు వివిధ అంశాలపై ఆర్బీఐ విధించిన వ్యాపార ఆంక్షల కారణంగా వృద్ధి అవకాశాలు అడుగంటిపోతున్నాయని ఈ మూడు బ్యాంకులు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ మూడు బ్యాంకులను విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.

 

మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

మరో మూడు బ్యాంకుల విలీనం నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

 

అలహాబాద్‌ 2017-18లో రూ. 4674 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా.. ఈ బ్యాంకు వద్ద ఉన్న నిరర్థక ఆస్తుల వాటా 15.96 శాతం. ఇక యూకో బ్యాంక్‌ రూ. 4436 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ బ్యాంకు రుణాల్లో ఏకంగా 25 శాతం రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. ఇక యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరిస్థితి కూడా అంతే. ఈ బ్యాంక్‌ నష్టాలు రూ.1,454 కోట్లుగా, ఈ బ్యాంక్‌ ఎన్‌పీఏలు కూడా 24.10 శాతం.

యూకో బ్యాంక్‌ను మరో పెద్ద లేదా లాభసాటి బ్యాంకుతో విలీనం చేస్తారనే వదంతులు మార్కెట్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరో లాభదాయక బ్యాంకులకు బదులు.. నష్టాల్లో ఉన్న మూడు బ్యాంకులను విలీనం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కాని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

 

Read Also : https://www.legandarywood.com/photo-shoot-aditirao-latest-poses-cosmopolitan/

About the Author

Related Posts

Leave a Reply

*